Begin typing your search above and press return to search.

ప్రేమ్ తో పాటు పెళ్లి చేసుకుంటాన‌న్న హీరో!

By:  Tupaki Desk   |   12 Nov 2022 12:30 AM GMT
ప్రేమ్ తో పాటు పెళ్లి చేసుకుంటాన‌న్న హీరో!
X
బాలీవుడ్ బ్యాచిల‌ర్ స‌ల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటాడా? లేదా? అన్న‌ది అతి పెద్ద మిస్టరీగా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. 55 ఏళ్లు దాటినా ఎప్ప‌టిక‌ప్పుడు స‌ల్మాన్ పెళ్లి వార్త‌లు మీడియా సహా ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర‌మే. ఇటీవ‌లే ఓ సంద‌ర్భంలో తాను పెళ్లి చేసుకుంటే రామ్ చ‌ర‌ణ్ వ‌య‌సున్న కుమారుడు ఉండేవాడు? అని స‌ల్మాన్ గుర్తు చేసుకుని సంతోష‌ప‌డ్డారు.

ఆ స‌మ‌యంలోనే స‌ల్మాన్ ధాంపత్య జీవితాన్ని కోల్పోతున్నాను అన్న బాధ‌లో ఉన్న‌ట్లు క‌నిపించింది. మ‌రి ఇది మీడియా ముందు న‌ట‌న‌..మ‌న‌న‌సులో మాట అన్న‌ది ఆ పెరుమాళ్ల‌కే ఎరుక‌. తాజాగా స‌ల్మాన్ నోట మ‌రోసారి పెళ్లి టాపిక్ వ‌చ్చింది. ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌ల్మాన్ మ‌రోసారి ప్రేమ్ గా అల‌రించ‌న‌న్న విష‌యాన్ని రివీల్ చేసారు.

ఈ సంద‌ర్భంలో ద‌ర్శ‌కుడు సూర‌జ్ బ‌ర్జాత్యా 'ప్రేమ్' మ‌ళ్లీ తిరిగొస్తాడు. టైటిల్ కూడా రిజిస్ట‌ర్ అయింది అని చెప్ప‌గానే.. స‌ల్మాన్ వెంట‌నే మైక్ అందుకుని ప్రేమ్ వ‌స్తాడు. దాంతో పాటు ఈసారి పెళ్లి కూడా చేసుకుంటాడు అని తెలిపారు. దీంతో అభిమానుల్లో ఒక్క‌సారిగా జోష్ మొద‌లైంది. స‌ల్మాన్ భాయ్ రియ‌ల్ లైప్ లో పెళ్లి చేసుకుంటాడు అన్న సంకేతాలు పాస్ చేసిన‌ట్లు సంతోష ప‌డుతున్నారు.

మ‌రి స‌ల్మాన్ రీల్ లైఫ్ లో పెళ్లి చేసుకుంటాడా? రియ‌ల్ లైఫ్ లో పెళ్లి చేసుకుంటాడా? అన్న‌ది క్లారిటీ లేదు. దీంతో నెట్టింట‌ ర‌క‌ర‌కాల మీమ్స్ మొద‌ల‌య్యాయి. 56 ఏళ్ల వ‌య‌సులో పెళ్లేంటి భాయ్? తాత‌య్య వయ‌సులో పెళ్లి చేసుకుంటే బాగుంటుందా? అంటూ న‌వ్వేస్తున్నారు. ఇక స‌ల్మాన్ కెరీర్ లో గుర్తుండి పోయే పాత్ర‌ల్లో ప్రేమ్ పాత్ర ఒక‌టి.

'మైనే ప్యార్ కియా'తో మొద‌లైన‌ ప్రేమ్ సంద‌డి 'హ‌మ్ ఆప్కే కౌన్'..'హమ్ సాత్ సాత్ హై'..'ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో' చిత్రాల వ‌ర‌కూ కొన‌సాగింది. ఈ నాలుగు సినిమాల‌కు సూర‌జ్ బ‌చ‌ర్జాత్యా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ప్ర‌స్తుతం ఆయ‌న తెర‌కెక్కించిన 'ఉంఛాయి' సినిమా ప్ర‌ద‌ర్శ‌న సంద‌ర్భంగా ముంబైలో జ‌రిగిన వేడుక‌కు స‌ల్మాన్ కూడా హాజ‌ర‌య్యారు . ఈ సంద‌ర్భంగా ప్రేమ్ ని మ‌రోసారి తెర‌పైకి తీసుకొస్తున్నట్లు ప్ర‌క‌టించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.