Begin typing your search above and press return to search.
పాన్ ఇండియాకి ఇది సరిపోతుందా సామ్..?
By: Tupaki Desk | 21 Sep 2022 4:47 AM GMTచేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సౌత్ హీరోయిన్లలో సమంత రూత్ ప్రభు ఒకరు. 'పుష్ప' చిత్రంలో ఊ అంటావా మావా అంటూ ఊపేసిన సామ్.. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడానికి ప్లాన్స్ వేసుకుంది. ఇప్పటికే 'శాకుంతలం' మరియు 'యశోద' వంటి రెండు మల్టీ లాంగ్వేజ్ చిత్రాలను పూర్తి చేసింది.
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ యాక్షన్ థ్రిల్లర్ ''యశోద''. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - గ్లింప్స్.. ఇటీవల వచ్చిన టీజర్ ఆసక్తికరంగా ఉన్నాయి. కాకపోతే సినిమాకు కావలసిన బజ్ తెచ్చిపెట్టలేకపోయాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
'యశోద' సినిమాలో సమంత గర్భిణీ స్త్రీగా కనిపించనుంది. ఆమెకు ఎదురైన కఠిన పరిస్థితులను ఎదురించి పోరాడే మహిళ కథను 'యశోద' సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పెద్దగా సందడి చేయకపోవడంతో.. అంచనాలు తగ్గుతూ వస్తున్నాయనే టాక్స్ వస్తున్నాయి.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ భారీ బడ్జెట్ తో 'యశోద' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకద్వయం హరి & హరీష్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా మార్చడానికేమో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మరియు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ను కూడా ఇందులో భాగం చేశారు.
రావు రమేష్ - మురళీ శర్మ - కల్పిక గణేష్ - సంపత్ రాజ్ వంటి పలువురు నటీనటులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎంతమంది ఉన్నా 'యశోద' సినిమా సమంత పేరు మీదుగానే మార్కెట్ చేయబడుతుంది. ప్రమోషనల్ కంటెంట్ లో ఇప్పటి వరకు ఆమె ఒక్కదాన్నే చూపించారు.
నిజానికి 'యశోద' సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి రావాల్సింది. ఆగస్టు 12న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. ఎప్పుడు థియేటర్లలోకి తీసుకొస్తారనే దానిపై క్లారిటీ రావడం లేదు.
ఎప్పుడొచ్చినా ఈ సినిమా సమంత బాలీవుడ్ ఎంట్రీకి ప్లస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది స్ట్రెయిట్ హిందీ మూవీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.. అంతకంటే ముందే 'యశోద' 'శాకుంతలం' చిత్రాలతో బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటున్నారు.
కంటెంట్ బాగుంటే పాన్ ఇండియా వైడ్ ఆదరణ లభిస్తుందని ఇటీవల పలు చిత్రాలు నిరూపించాయి. ఇప్పుడు సినిమా బాగుంటే 'యశోద' విషయంలోనూ అదే జరుగుతుంది. కాకపోతే ఆలోపు బజ్ క్రియేట్ చేయడానికి దూకుడుగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరముంది. మరి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించి ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.