Begin typing your search above and press return to search.

సామ్ పాన్ ఇండియా మూవీ కోసం పాన్ ఇండియా స్టార్స్!

By:  Tupaki Desk   |   26 Oct 2022 10:47 AM GMT
సామ్ పాన్ ఇండియా మూవీ కోసం పాన్ ఇండియా స్టార్స్!
X
స‌మంత న‌టిస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'య‌శోద‌'. ఈ మూవీ ద్వారా హ‌రి, హ‌రీష్ ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీ‌దేవి మూవీస్ బ్యాన‌ర్ పై శివ‌లెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ప‌లు ద‌ఫాలుగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌చ్చిన‌ ఈ మూవీని ఫైన‌ల్ గా న‌వంబ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నామంటూ చిత్ర బృందం ఇటీవ‌ల అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

మ‌ల‌యాళ న‌టుడు ఉన్ని ముకుంద‌న్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్రల్లో న‌టించిన ఈ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల్లో బైలింగ్వ‌ల్ గా తెర‌కెక్కించారు. అయితే వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. సినిమా రిలీజ్ కి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ మూవీ ట్రైల‌ర్ ని గురువారం ఈ నెల 27న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఇటీవ‌ల ఈ మూవీ టీజ‌ర్ ని విడుద‌ల చేసిన మేక‌ర్స్ ట్రైల‌ర్ రిలీజ్ కోసం ఇప్ప‌టికే భారీ ప్లాన్ ని సిద్ధం చేశారు. సినిమా రిలీజ్ డేట్ ని వినూత్నంగా ప్ర‌క‌టించిన చిత్ర బృందం ట్రైల‌ర్ ని కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతోంది. ఇందు కోసం పాన్ ఇండియా స్టార్ ల‌ని రంగంలోకి దింపేస్తోంది. సామ్ కోసం పాన్ ఇండియా స్టార్స్‌ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సూర్య, ర‌క్షిత్ శెట్టి, దుల్క‌ర్ స‌ల్మాన్‌, వ‌రుణ్‌ ధావ‌న్ లు రంగంలోకి దిగుతున్నారు.

ట్రైల‌ర్ ని తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, త‌మిళంలో సూర్య‌, క‌న్న‌డ‌లో ర‌క్షిత్ శెట్టి, మ‌ల‌యాళంలో దుల్క‌ర్ స‌ల్మాన్‌, హిందీతో వ‌రుణ్ ధావ‌న్ రిలీజ్ చేయ‌బోతున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీకి మ‌ణిర‌శ్మ సంగీతం అందిస్తున్నారు.

త‌మిళ మూవీ 'కాతువాకుల రెండు కాద‌ల్‌' త‌రువాత సామ్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. స‌మంత కూడా ఈ మూవీపై భారీ ఎక్స్ పెక్టేష‌న్స్ తో వున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఇదిలా వుంటే సామ్ న‌టించిన 'శాకుంత‌లం' చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. స్టార్ డైరెక్ట‌ర్ ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ స్థాయిలో నిర్మించిన విష‌యం తెలిసిందే. 3డీ ఫార్మాట్ లోనూ రిలీజ్ కానున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. సామ్ న‌టించిన తొలి మైథ‌లాజిక‌ల్ డ్రామా కావ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచ‌నాలే వున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.