Begin typing your search above and press return to search.

సంజ‌య్ ద‌త్ టాలీవుడ్ డెబ్యూ ఇదేనా?

By:  Tupaki Desk   |   19 Dec 2022 9:30 AM GMT
సంజ‌య్ ద‌త్ టాలీవుడ్ డెబ్యూ ఇదేనా?
X
బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ టాలీవుడ్ డెబ్యూ ఫిక్సైందా? ఓ వైవిథ్య‌మైన పాత్ర‌తో ఖ‌ల్నాయ‌క్ తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డా నికి రెడీ అవుతున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇప్ప‌టికే సంజ‌య్ ద‌త్ కేజీఎఫ్ చాప్ట‌ర్ -2 లో అధీర పాత్ర‌లో సౌత్ ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అధీర ఆహార్యం స‌హ పాత్ర‌లో ద‌త్ ఒదిగిపోయారు. ఆహార్యానికి త‌గ్గ‌ట్టు అధీర పాత్ర పేరు అంతే హైలైట్ అయింది. భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ద‌త్ మార్క్ పెర్పార్మెన్స్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది.

ఇప్పుడ‌దే ఖ‌ల్నాయ‌క్ ఓ తెలుగు సినిమాలో తాత‌య్య పాత్ర పోషించ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. డార్లింగ్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో 'డీల‌క్స్ రాజా' అన‌ధికారిక టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్కిస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. ఇది తాత‌-మ‌న‌వ‌డు-ఓ సినిమా థియేట‌ర్ నేప‌థ్యంలో సాగే క‌థ. ఇందులో రెండు విభిన్న పాత్ర‌ల్లో డార్లింగ్ క‌నిపిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది.

ఒక పాత్రలో యువ‌కుడిగానూ..మ‌రో పాత్ర‌లో తాత‌య్య‌గానూ క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం సాగింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఆ తాత పాత్ర‌ని బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కి అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది.

మారుతీ వినిపించిన క‌థ న‌చ్చ‌డంతో సంజయ్ దత్ సినిమాకు సంతకం చేసిన‌ట్లు తెలుస్తోంది. అందుకు గానూ భారీగానే పారితోషికం చెల్లిస్తున్న‌ట్లు స‌మాచారం. ఫిబ్రవరి 2023 నుండి సంజ‌య్ ద‌త్ ఈ సినిమాకు డేట్స్ కూడా కేటాయించార‌ని వినిపిస్తుంది.

ఈ చిత్రంలో ప్రభాస్‌కి బామ్మగా బాలీవుడ్‌ నటి జరీనా వహాబ్ ఇప్ప‌టికే ఎంపికైంది. ఆలెక్క‌న తాత పాత్ర సంజ‌య్ ద‌త్ పోషిస్తే జ‌రీనా వ‌హాబ్ కి భ‌ర్త పాత్ర‌గా క‌నిపించొచ్చు. ఇప్ప‌టికే ఈసినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్త‌య్యాయి. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ కి నిర‌వ‌ధికంగా హాజ‌ర‌య్యారు.

వచ్చే ఏడాది మొదట్లో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అప్ప‌టి నుంచి త‌న పాత్ర షూట్ మొత్తం పూర్తిచేసేవ‌ర‌కూ మ‌రో సినిమా సెట్ లో కాలు పెట్ట‌ర‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇందులో డార్లింగ్ కి జోడీగా మాళవిక మోహనన్.. నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ భారీ సెట్ లోనే ఎక్కువ భాగం షూటింగ్ జరుగుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.