Begin typing your search above and press return to search.
టీం ఇండియా స్టార్ నటించిన సినిమా రిలీజ్ కు రెడీ
By: Tupaki Desk | 11 Oct 2022 1:30 PM GMTటీం ఇండియా క్రికెటర్స్ ఒకప్పుడు వెండి తెరకు దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు బుల్లితెర మరియు వెండి తెర ఏ ఒక్క తెరను వదలడం లేదు. టీం ఇండియా స్టార్ క్రికెటర్స్ కొందరు బాలీవుడ్ స్టార్ హీరోలను మించిన క్రేజ్ స్టార్ డమ్ ను దక్కించుకున్నారు. అందులో శిఖర్ ధావన్ ఒకరు అనడంలో సందేహం లేదు.
రెగ్యులర్ గా ఇండస్ట్రీలో టచ్ లోనే ఉంటూ ఏదో ఒక యాడ్ లో చిత్రీకరణ లో పాల్గొంటూ ఉండే టీమ్ ఇండియా క్రికెటర్స్ అప్పుడప్పుడు ఇలా సినిమాల్లో కూడా నటించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
శిఖర్ దావన్ తాజగా డబుల్ ఎక్స్ఎల్ అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఆ పాత్రకు సంబంధించిన స్టిల్ ను సోషల్ మీడియా షేర్ చేశారు.
సోనాక్షి సిన్హా మరియు హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డబుల్ ఎక్స్‌ఎల్ సినిమాలో నటించడం పట్ల శిఖర్ దావన్ స్పందిస్తూ... దేశం కోసం ఆట ఆడే అథ్లెట్స్ జీవితం ఎప్పుడు హడావుడిగా ఉంటుంది. ఇది ఒక మంచి వినోదాత్మక సినిమా అవ్వడం వల్ల నేను నటించేందుకు అంగీకరించాను అన్నాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ... ఈ కథ విన్న సమయంలో నా పై ఈ సినిమా చాలా ప్రభావం చూపిస్తుంది అనుకున్నాను. కేవలం నా ఒక్కడిపైనే కాకుండా ఈ సమాజానికి ఒక మంచి సినిమా గా నిలవడంతో పాటు ఒక మంచి సందేశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే వరుసగా సినిమాలు చేస్తాడేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.