Begin typing your search above and press return to search.
'సింగం-3' విశ్వంలోకి మహిళా పోలీస్?!
By: Tupaki Desk | 2 Aug 2022 5:33 AM GMTసౌత్ లో బ్లాక్ బస్టర్లు కొట్టిన సినిమా కథల్ని బాలీవుడ్ అడాప్ట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు సూర్య కథానాయకుడిగా నటించిన సింగం సిరీస్ సినిమాల్ని బాలీవుడ్ లో రోహిత్ శెట్టి రీమేక్ చేశారు. పోలీస్ సినిమాల స్పెషలిస్టుగా పేరున్న శెట్టి ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో భాగం (సింగం 3) తెరకెక్కించేందుకు పావులు కదుపుతున్నాడు. ఇది కాప్ సిరీస్ లోనే అతి పెద్ద విశ్వం (యూనివర్శ్) అంటూ ప్రచారం సాగిపోతోంది. అంతేకాదు.. ఈసారి కాప్ విశ్వంలో మహిళా పోలీస్ ని బరిలో దించే ఆలోచన ఉందని రోహిత్ శెట్టి కన్ఫామ్ చేశాడు.
ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ తో 'సర్కస్' విడుదలకు సిద్ధమవుతుండగా రోహిత్ శెట్టి అండ్ టీమ్ ప్రచారంలో బిజీ కానుంది. ఈలోగానే అజయ్ దేవగన్ తో తెరకెక్కించాల్సిన 'సింగం 3'పై ఇప్పటికే పని ప్రారంభమైందని శెట్టి ధృవీకరించారు. కాప్ విశ్వం కోసం సింగం- సింబా - సూర్యవంశీగా అజయ్ దేవగన్.. రణవీర్ సింగ్ .. అక్షయ్ కుమార్ లను అతడు సిద్ధం చేస్తున్నాడని హింట్ అందింది. రణవీర్ సింగ్ తో అతని సర్కస్ డిసెంబర్ 23న విడుదలకు సిద్ధంగా ఉండగా రోహిత్ తాజా ఇంటర్వ్యూలో సింఘం 3 కోసం ప్రిపరేషన్ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు.
''ఇప్పటికే సింగం 3 పనిని ప్రారంభించాం. నేను ఔట్ అండ్ ఔట్ సింగం సినిమా చేసి చాలా రోజులైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభిస్తాం. అజయ్ సర్ తన కమిట్ మెంట్ లతో బిజీగా ఉన్నాడు. నేను కూడా 'సర్కస్'తో బిజీగా ఉన్నాను. కాబట్టి ఏప్రిల్ నాటికి సింగం 3ని ప్రారంభిస్తాం. ఇది ఇప్పటివరకు మేము రూపొందించిన అతిపెద్ద పోలీస్ విశ్వం (కాప్ యూనివర్శ్) అవుతుంది'' అని రోహిత్ తెలిపాడు. అయితే అతడు సింగం 3 గురించి ఇతర వివరాలను వెల్లడించకుండా రహస్యంగా దాచాడు. సింగం 3లో అజయ్ తో పాటు అక్షయ్ - రణవీర్ నటిస్తారా? అన్నదానిని అతడు రహస్యంగా దాచి ఉంచాడు.
నేటి కాలంలో మల్టీ-స్టారర్ ను తీయడం చాలా కష్టం. నటీనటులు తనపై పూర్తి నమ్మకంతో ఉన్నందున ఇలాంటివి తెరకెక్కించడం తనకు కష్టమైన పని కాదని రోహిత్ శెట్టి నొక్కి చెప్పాడు. ''అజయ్ సార్.. అక్షయ్ సార్ పాత పాఠశాల నుండి వచ్చారు. వారంతా మల్టీస్టారర్ సినిమాలు చేయాలని కోరుకుంటారు. నేను తనను సరైన మార్గంలో ప్రెజెంట్ చేస్తాననే నమ్మకం రణవీర్ కు ఉంది. భారీ మల్టీస్టారర్లు తీయడంలో నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు'' అని తెలిపాడు.
అంతేకాదు.. యువ హీరోలు కూడా తమ మేనేజర్ల మాట విని ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి నటించే సినిమాల పని మొదలు పెట్టాలి. అభద్రతా భావం వదిలేయాలి.. లేకపోతే నిర్మాతలకు పెద్ద ఎత్తున భారీ సినిమాలు తీయడం కష్టమేనని కూడా రోహిత్ శెట్టి అభిప్రాయపడ్డారు. రెండేళ్ల తర్వాత మళ్లీ కంటెంట్ సినిమాలు వర్క్ అవుతాయి. కానీ తదుపరి 2 నుండి 3 సంవత్సరాల వరకు ఇద్దరు ముగ్గురు హీరోలతో సరైన మార్గంలో పెద్ద స్థాయి సినిమాలు తీయడం అవసరం. పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారు! అని రోహిత్ వివరించాడు.
సూర్యవంశీ ప్రమోషన్ల సమయంలో రోహిత్ త్వరలో తన విశ్వంలోకి ఒక మహిళా పోలీసు ప్రవేశిస్తుందని ధృవీకరించాడు. దాని గురించి తిరిగి ప్రశ్నించగా.. ''మహిళా పోలీస్ మూవీ చేయాలి. అది మునుముందు సాధ్యమవుతుంది'' అని తెలిపాడు. రోహిత్ తదుపరి ప్రాజెక్ట్ లలో సిద్ధార్థ్ మల్హోత్రాతో 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' చిత్రీకరణలో ఉంది. రణవీర్ సింగ్ తో సర్కస్ విడుదలకు సిద్ధం కానుంది.