Begin typing your search above and press return to search.
పుష్కర కాలం తర్వాత కలుస్తున్నారు.. ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో..?
By: Tupaki Desk | 8 July 2022 11:30 AM GMTసూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ పై ప్రేక్షకులల్లో మంచి అంచనాలు ఉంటాయి. వీరి కలయికలో గతంలో వచ్చిన 'అతడు' సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'ఖలేజా' చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి జతకట్టబోతున్నారు.
మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ SSMB28 కు చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. 'సర్కారు వారి పాట' సినిమా వచ్చి రెండు నెలలు గడుస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ 28వ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్టులో స్టార్ట్ చేస్తారు. మహేశ్ హాలిడేలో ఉన్నప్పుడు త్రివిక్రమ్ పూర్తి స్క్రిప్ట్ ను నెరేట్ చేసాడు. అగ్ర హీరో అందులో పలు మార్పులు సూచించగా.. అన్ని చేంజెస్ చేసిన దర్శకుడు ఫైనల్ స్క్రిప్టును వివరించాడు. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్.. షెడ్యుల్ ను ప్లాన్ చేసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సెట్స్ నిర్మాణం మొదలుపెట్టిన నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారట. మరోవైపు నటీనటులు, సాంకేతిక నిపుణులను ఖరారు చేశారని తెలుస్తోంది. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే 2023 ప్రథమార్థంలో ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.
త్రివిక్రమ్ తో చేసిన రెండు సినిమాలలోనూ మహేష్ బాబు చాలా డిఫరెంట్ గా కనిపించారు. 'అతడు' లో సబ్టిల్ క్యారక్టర్ లో కనిపిస్తే.. 'ఖలేజా' తో తనలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీశారు. అందుకే ఈ క్రేజీ కాంబో పై అందరిలో ఆసక్తి నెలకొంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత దర్శక హీరోలు కలసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో సెట్స్ మీదకు వెళ్ళకుండగానే ఈ ప్రాజెక్ట్ నాన్-థియేట్రికల్ రైట్స్ భారీ ధర పలికిందని టాక్ వినిపిస్తోంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా కోసం మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ఇద్దరూ భారీ రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. 'అల వైకుంఠపురములో' తర్వాత దర్శకుడు చేయనున్న సినిమా ఇదే.
SSMB28 చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ఆర్.మాది సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారు. పుష్కర కాలం తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కలిసి చేయబోతున్న ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.