Begin typing your search above and press return to search.
సందీప్ కిషన్.. ఈసారైనా కొట్టవయ్యా?
By: Tupaki Desk | 16 Jan 2023 4:54 AM GMTటాలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు సందీప్ కిషన్. కెరియర్ ఆరంభంలో ప్రస్థానం లాంటి సినిమాతో నటుడిగా తానేంటో సందీప్ కిషన్ ప్రూవ్ చేసుకున్నాడు. అయితే కెరియర్ ఒక్క వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ అయితే సందీప్ కిషన్ కెరియర్ లో లేదని చెప్పాలి.
సొంత ప్రొడక్షన్ లో హర్రర్ థ్రిల్లర్ నిను వీడని నీడను నేనే సినిమా కూడా సోలో గా సందీప్ కిషన్ కి సక్సెస్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ అనే రేంజ్ సినిమా అయితే కెరియర్ లో ఇప్పటి వరకు పడలేదని చెప్పాలి. అయినా కూడా ఏ మాత్రం తగ్గకుండా తన స్టైల్ లో సందీప్ కిషన్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.
అలాగే ఈ మధ్యకాలంలో కాస్తా డిఫరెంట్ జోనర్ లో కథలని ట్రై చేస్తున్నాడు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం సందీప్ కిషన్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా తెలుగులో మొదటి సారి డిఫరెంట్ కథాంశంతో ఊరు పేరు భైరవకొన అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటు పాన్ ఇండియా లెవల్ లో తనని తాను రిప్రజెంట్ చేసుకోవడానికి మైఖేల్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.
ఈ సినిమా ట్రైలర్ జనవరి 21న రానుండగా.. సినిమాను ఫిబ్రవరి 3న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీకి సంబందించిన టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ కథాంశంతో ఈ మూవీ ఉండబోతుందని టీజర్ బట్టి అర్ధమైంది. ప్రస్తుతం మాఫియా బ్యాక్ డ్రాప్ కథలని మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
కేజీఎఫ్ తర్వాత ఇలాంటి కథలని ఎక్కువగా ప్రేక్షకులు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మైఖేల్ కథని పీరియాడిక్ టచ్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో సందీప్ కిషన్ చేశాడు. దీంతో పాటు ధనుష్ పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ మూడు సినిమాలతో ఈ ఏడాదిలో కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో సందీప్ కిషన్ ఉన్నాడని తెలుస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.