Begin typing your search above and press return to search.

10 భాష‌ల్లో 3డీ ఫార్మెట్ లో సూర్య 42!

By:  Tupaki Desk   |   17 Dec 2022 5:26 AM GMT
10 భాష‌ల్లో 3డీ ఫార్మెట్ లో సూర్య 42!
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్పాన్ డే బై డే మ‌రింత పెరుగుతోంది. జాతీయ అవార్డ‌లు సైతం అందుకుని పాన్ ఇండియాలో సత్తా చాటుతున్నాడు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని అన్ని భాష‌ల్లోనూ సొంతం చేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే కోలీవుడ్..టాలీవుడ్ త‌నేంటో నిరూపించుకున్నాడు. రోలెక్స్ పాత్ర‌తో పాన్ ఇండియాలో సెన్షేష‌న్ అయ్యాడు.

ఇప్పుడ‌దే రోల్ తో ఏకంగా ఓ స్వ‌తంత్ర్య సినిమానే చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. దాన్ని దేశంలో అన్ని భాష‌ల్లో రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. లోకేష్ క‌న‌గ‌రాజ్ లాంటి క్రియేటివ్ మేక‌ర్ తోడ‌వ్వ‌డంతో సూర్య రేంజ్ అంత‌కంత‌కు పెరుగుతుంద‌ని భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. అయితే అంత‌క‌న్నా ముందే సూర్య త‌న 42వ చిత్రం ద్వారా ఏకంగా ప‌ది భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

ప్ర‌స్తుతం సూర్య హీరోగా త‌న 42వ చిత్రం శివ ద‌ర్శ‌త‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ఈ భారీ పిరియాడిక్ డ్రామాని రెండు భాగాలు గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్ప‌టికే గోవా..చెన్నై లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. శుక్ర‌వారం నుంచి తాజా షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ లో దిశాప‌టానీ కూడా పాల్గొంటుంది. ఈ విష‌యాన్ని అమ్మ‌డు ఇన్ స్టా ద్వారా తెలిపింది.

సూర్య స‌ర‌స‌న అమ్మ‌డు న‌టిస్తోన్న తొలి చిత్రం కావ‌డంతో ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్న‌ట్లు వారం రోజులు క్రిత‌మే ఓ పోస్ట్ పెట్టింది. తాజాగా ఆ ఎగ్టైట్ మెంట్ కి నిన్న‌టి తో తెర‌పైడింది. ఇక ఈ చిత్రాన్ని 3డీ ఫార్మెట్ లో రిలీజ్ చేయ‌నున్నారు. ఏకంగా ప‌దిభాష‌ల్లో ఒకేసారి చిత్రాన్ని ఈ ఫార్మెట్ లో రిలీజ్ చేస్తున్నారు. ప‌ది భాష‌ల్లో సూర్య చిత్రం రిలీజ్ కావ‌డం కూడా ఇదే తొలిసారి .

ఇప్ప‌టివ‌ర‌కూ త‌మిళ్ ..తెలుగుతో పాటు ఇంకొన్ని భాష‌ల్లో మాత్ర‌మే సూర్య సినిమాలు రిలీజ్ అయ్యేవి. ప్ర‌స్తుతం హీరోలంతా పాన్ ఇండియా మోజులో సినిమాలు చేస్తున్నారు. కంటెంట్ కూడా అంద‌రికీ రీచ్ అయ్యేలాగే ప్లాన్ చేసుకుంటున్నారు. శివ తెర‌కెక్కిస్తోన్న సినిమా కూడా పీరియాడిక్ చిత్రం కావ‌డం...రెండు భాగాలు తెర‌కెక్కించ‌డం వంటివి సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు పెచేస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.