Begin typing your search above and press return to search.
బిబి6 మొదటి వరస్ట్ పెర్ఫార్మర్.. కెప్టెన్ వీళ్లే
By: Tupaki Desk | 10 Sep 2022 11:32 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయ్యి వారం రోజులు అవుతూనే ఉంది. నేడు మొదటి వీకెండ్ ఎపిసోడ్ ప్రసారం అవ్వబోతుంది. నేడు మొదటి ఎలిమినేషన్ కూడా ఉంటుంది. ఎలిమినేషన్ అయ్యింది ఎవరు అనేది రేపు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా లేక పోలేదు అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు.
బిగ్ బాస్ మొదటి అయిదు రోజుల్లో వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అంటూ హౌస్ లో ఉన్న వారందరిని బిగ్ బాస్ ప్రశ్నించగా మెజార్టీ శాతం మంది గీతూ రాయల్ కి ఓటు వేశారు.
ఆమె కెప్టెన్సీ టాస్క్ లో వ్యవహరించిన తీరుపై ఎక్కువ శాతం మంది ఫిర్యాదు చేశారు. నేను నా డ్రస్ లో వస్తువులు దాచుకుంటాను.. దాన్ని అబ్బాయిలు షర్ట్ లో చేయి పెట్టి తీసినా కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంది.
ఆ మాటలు ఇతర అమ్మాయిలకు కరెక్ట్ అనిపించలేదు. అంతే కాకుండా అబ్బాయిలు కూడా ఆ విషయం పట్ల కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తానికి ఆమె అతి ప్రవర్తన.. విషయం లేని చోట హడావుడి చేయాలని ప్రయత్నించే స్వభావం కారణంగా ఆమెను వరస్ట్ అంటూ ఎంపిక చేసుకున్నామని కొందరు అన్నారు.
ఇక కెప్టెన్సీ టాస్క్ లో కూల్ అండ్ స్టడీ పెర్ఫార్మెన్స్ తో బిగ్ బాస్ మొదటి కెప్టెన్ గా బాలాదిత్య నిలిచాడు. అతడికి మంచి మద్దతు దక్కడంతో పాటు ఆయన బాగా ఆడాడు. అయితే టాస్క్ లో గీతూ రాయల్ విజేతగా నిలిచినప్పటికి ఆమె ఆట సరిగా ఆడలేదు అంటూ ఆమెను కాకుండా బాలాదిత్య ను కెప్టెన్ గా ఎంపిక చేయడం జరిగింది.
మొత్తానికి మొదటి వారం లోనే హడావుడి.. ఆగం ఆగం గా కంటెస్టెంట్స్ చేసిన రచ్చ తో గొడవలు చాలానే అయ్యాయి. ముందు ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుందా.. లేదంటే పరిస్థితి మారుతుందా అనేది చూడాలి. ఈ వారం బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ఏ కంటెస్టెంట్ కి వార్నింగ్ లు ఇస్తాడో మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.