Begin typing your search above and press return to search.

విజయ్ 67 : వామ్మో ఈ రేంజ్ ప్లానింగా?

By:  Tupaki Desk   |   21 Jan 2023 2:30 PM GMT
విజయ్ 67 : వామ్మో ఈ రేంజ్ ప్లానింగా?
X
దళపతి విజయ్.. ఒక్క పాన్ ఇండియా సినిమా తీయకపోయినా.. ఆ రేంజ్లో ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఆయన వారసుడు అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంతో పాటు.. తెలుగులో కూడా రిలీజ్ అయింది. తమిళనాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11న విడుదలైంది. సినిమాలో రష్మిక మందన కథానాయిక. ఆ తర్వాత మూడు రోజుల తర్వాత తెలుగులో రిలీజ్ చేశారు.

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా తమిళనాడులో పర్వాలేదని పించింది. కలెక్షన్ల వర్షం అయితే కురిపిస్తోంది. తెలుగులో మాత్రం వారసుడు చిత్రాన్ని చూసిన వారు మూడు నాలుగు సినిమాలను చూసిన ఫీల్ కలుగుతుందని అంటున్నారు. ఏదీ ఏమైనా తెలుగులోనూ వారసుడు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ... ముందుకు వెళ్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు దళపతి విజయ్ 67 చిత్రానికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. మొదట దళపతి విజయ్ తన 67వ సినిమాను లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో వార్త హల్చల్ చేస్తోంది.

దళపతి విజయ్ తన 67వ సినినమాను గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్కు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీయడంలో దిట్ట. ఆయన తీసిన ఏ మాయ చేశావే, ఎటో వెళ్లిపోయింది మనసు, సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్, తమిళంలో సూర్య జ్యోతికలతో ఖాక,ఖాఖి వంటి సినిమాలు లవ్ అండ్ ఎంటర్టైనింగ్గా సూపర్ హిట్ అయ్యాయి.

ఆయన సినిమాలు తీయడమే కాదు... ఇటీవల సీతారామం సినిమాలో ఓ పాత్ర కూడా చేశాడు. ఆ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ సినిమా సైతం జనాల్లోకి బాగా వెళ్లింది. ఇక ఆయన దర్శకత్వంలో విజయ్ సినిమా అంటే అంచనాలు రెట్టింపు అవుతాయి.

ఇక ఈ సినిమాలో విజయ్కు జోడిగా త్రిష నటించనుంది. చాలా ఏళ్ల తర్వాత ఈ జోడి ప్రేక్షకుల ముందుకు రావడంతో.. ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, మన్సూర్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. మరి ఈ సినిమా ఏమేరకు అలరించనుందో.. ఎప్పుడు పట్టాలెక్కనుందో వేచి చూడాల్సింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.