Begin typing your search above and press return to search.

ఆ బాలీవుడ్ హీరో రకుల్ ని వ‌దిలేలా లేడే?

By:  Tupaki Desk   |   9 Sep 2022 2:30 AM GMT
ఆ బాలీవుడ్ హీరో రకుల్ ని వ‌దిలేలా లేడే?
X
బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ని ఇప్ప‌ట్లో వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. తెలుగులో టాప్ హీరోలంద‌రితో క‌లిసి న‌టించి టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ర‌కుల్ ప్రీత్ సింగ్... సిద్ధార్ధ్ మ‌ల్హోత్ర హీరోగా న‌టించిన 'అయ్యారీ' సినిమాతో బాలీవుడ్ బాట ప‌ట్టింది. మ‌ధ్య‌లో క్రిష్ డైరెక్ట్ చేసిన 'కొండ పొలం' చిత్రంలో న‌టించినా అది పెద్ద‌గా ఆడ‌లేదు. దీంతో మ‌ళ్లీ బాలీవుడ్ నే నమ్ముకుంది. అక్క‌డే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.

ఇదిలా వుంటే బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ్ గ‌న్ 'దే దే ప్యార్ దే' మూవీ నుంచి ర‌కుల్ ని వ‌ద‌ల‌డం లేదు. త‌న ప్ర‌తి సినిమాలో ర‌కుల్ వుండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన 'దే దే ప్యార్ దే' బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో సెంటిమెంట్ గా భావించిన అజ‌య్ దేవ‌గ‌న్ ర‌కుల్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవ‌ల త‌ను డైరెక్ట్ చేసిన 'ర‌న్ వే 34'లోనూ ర‌కుల్ ని హీరోయిన్ గా తీసుకున్న అజ‌య్ తాజాగా మ‌రో మూవీ కోసం కూడా త‌న‌నే రిఫ‌ర్ చేయ‌డం విశేషం.

అజ‌య్ దేవ్ గ‌న్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'థాంక్ గాడ్‌'. టి సిరీస్‌, మారుతీ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ ల‌పై ఇంద్ర కుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్ధ్ మ‌ల్హోత్ర కూడా న‌టిస్తున్నాడు. ఫాంట‌సీ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఇందులో అజ‌య్ దేవ్‌గ‌న్ మోడ్ర‌న్ చిత్ర గుప్తుడిగా క‌నిపించ‌బోతున్నాడు.

గుర‌వారం ఈ మూవీలో త‌న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా హీరో అజ‌య్ దేవ్ గ‌న్ విడుద‌ల చేశారు. బ్లాక్ సూట్ ధ‌రించి సింహాస‌నం పై సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో సూప‌ర్ కూల్ గా క‌నిపిస్తున్న అజ‌య్ లుక్ ఆక‌ట్టుకుంటోంది.

ఈ ఫ‌స్ట్ లుక్ ఫొటోతో పాటు ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్ ని జ‌త చేశాడు. ఈ దీపావ‌ళికి చిత్రగుప్తుడు మీతో మ‌రియు మీ ఫ్యామిలీతో జీవితం మొక్క గేమ్ ఆడ‌టానికి వ‌స్తున్నాడు. ట్రైల‌ర్ శుక్ర‌వారం విడుద‌ల కాబోతోంది. అక్టోబ‌ర్ 25న వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాం అని ప్ర‌క‌టించాడు.

దిల్‌, బేటా, రాజా, మ‌న్ , ఆషికీ వంటి ఎవ‌ర్ గ్రీన్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని అందించిన ఇంద్ర‌కుమార్ దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత చేస్తున్న సినిమా కావ‌డంతో 'థాంక్ గాడ్‌'పై అజ‌య్ దేవ్ గ‌న్, ర‌కుల్ ప్రీత్ సింగ్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నార‌ట‌.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.