Begin typing your search above and press return to search.
రంగీలా ఊర్మిల రీఎంట్రీ సెన్సేషన్స్
By: Tupaki Desk | 4 Oct 2022 3:42 AM GMT90లలో హాటెస్ట్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఊర్మిలా మటోండ్కర్. ఆర్జీవీ డిస్కవరీగా తనకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. రంగీలా- సత్య- భారతీయుడు వంటి చిత్రాలతో బంపర్ హిట్లు కొట్టిన ఊర్మిల పాపులారిటీ నాడు స్కైని టచ్ చేసింది. ఇటీవల ఊర్మిళ మటోండ్కర్ బుల్లితెర రియాలిటీ షోలతోనూ సందడి చేస్తున్నారు. డిఐడి సూపర్ మామ్స్ షోలో న్యాయనిర్ణేతగా చిన్న స్క్రీన్ పై ప్రేక్షకులను అలరిస్తున్నారు.
అందాల వెటరన్ నటి ఊర్మిల ఇప్పుడు 'తివారీ' అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగ ప్రవేశం చేయనుంది. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. ఊర్మిళ లుక్ షాకింగ్ గా ఉంది. తన శరీరం అంతా గాయాలు రక్తంతో నిండి ఉంది. ఒక చిన్న పట్టణంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కిందని సమాచారం.
అయితే ఇందులో ఊర్మిల అడ్వెంచరస్ పాత్రతో మెస్మరైజ్ చేయనుందని తన లుక్ చెబుతోంది. ఇందులో ఆమె టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ స్క్రిప్టును ఎంపిక చేయడానికి ముందు ఊర్మిల దాదాపు 50 స్క్రిప్టులను తిరస్కరించానని తెలిపారు. సౌరభ్ వర్మ దర్శకత్వం వహించిన 'తివారీ' సిరీస్ ని రాజ్ కిషోర్ ఖవారే - ఉత్పల్ ఆచార్య సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. విడుదల తేదీ ఇతర సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఇతర తారాగణం వివరాలను టీమ్ వెల్లడించనుంది.
క్లాసిక్ మూవీ రిలీజై 25 వసంతాలు పూర్తి
ఊర్మిల కెరీర్ క్లాసిక్ డేస్ మెమరీస్ లోకి వెళితే.. నాటి రోజుల్ని అభిమానులు అస్సలు మర్చిపోలేరు. ముఖ్యంగా రంగీలా డేస్ ని ఎవరూ మర్చిపోలేరు. ఊర్మిల మటోండ్కర్ లాంటి గొప్ప ట్యాలెంటును బయటి ప్రపంచానికి ఆవిష్కరించిన ఘనత తెలుగు వాడైన ఆర్జీవీకే దక్కుతుంది. ఇదే సినిమాతో అమీర్ ఖాన్.. జాకీ ష్రాఫ్ లాంటి స్టార్లకు గొప్ప గౌరవం గుర్తింపు దక్కాయి. ఆ ముగ్గురూ ఒకరితో ఒకరు పోటీపడి నటించేంత గొప్ప స్క్రిప్టును తీర్చిదిద్దారు ఆర్జీవీ. ఇక ఈ మూవీలో యాయిరే యాయిరే సాంగ్ అయితే దశాబ్ధం పాటు ఓ ఊపు ఊపింది.
రంగీలా రిలీజై 25 సంవత్సరాలైంది. ఊర్మిల అసాధారణ ప్రతిభను ఆవిష్కరించడమే గాక.. దర్శకుడు ఆర్జీవీ ఈ మ్యూజికల్ డ్రామా మూవీతో బి ‑ టౌన్ లో ఒక చరిత్ర సృష్టించాడు. చరిత్రలో నిలిచిన ఒక ఐకానిక్ మూవీ ని ఆయన అందించారు.
ఇక ఈ మూవీలో ఉర్మిలా పనితీరును కేవలం మాటల్లోనే ప్రశంసించలేరు. ఆమె అందం వర్ణించలేనిది. నట ప్రతిభకు కొలమానాలేవీ లేవు. షో బిజినెస్ గురించిన కథతో రంగీలా తెరకెక్కింది. ఇది ముక్కోణ ప్రేమకథ. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గాను నిలిచింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.