Begin typing your search above and press return to search.
ఊర్వశి..తో మళ్లీ అవి జోరందుకునేలా వున్నాయే!
By: Tupaki Desk | 5 Nov 2022 7:33 AM GMTఅల్లు శిరీష్ దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత నటించి ఆ వేయిటింగ్ కి తగ్గ ఫలితాన్ని దక్కించుకున్నాడు. తను నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'ఊర్వశివో రాక్షసివో'. రాకేష్ శశి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2పై అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మోగిలినేని, విజయ్ నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీకి యూత్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీతో దాదాపు పది సినిమాలు విడుదలయ్యాయి.
అయితే అందులో కాస్త అడల్ట్ కంటెంట్.. యూత్ ని ఆకట్టుకునే ఇంటిమేట్ సీన్ లు పుష్కలంగా వుండటంతో యూత్ ఈ మూవీకే జై కోడుతున్నారు. గత కొంత కాలంగా సరైన హిట్టు కోసం అల్లు శిరీష్ తో పాటు హీరోయిన్ ఇమ్మాన్యుయేల్ ఎదురుచూస్తోంది. ఆశించిన హిట్ ని సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో భాగంగానే ఈ ఇద్దరు బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నారు. హిట్టు కొట్టాలనుకున్నారు. ఫైనల్ గా వారు అనుకున్నదే జరిగింది.
ఏ సీన్స్ అయితే యూత్ ని థియేటర్లకి రప్పిస్తాయని, యూత్ కి పిచ్చెక్కిస్తాయని భావించారో అవే ఇప్పడు ఈ మూవీకి ప్రధాన అస్త్రాలుగా మారి విజయాన్ని అందించాయి. అయితే బోల్డ్ కంటోంట్.. మోతాదుకు మించిన ఇంటిమసీ సీన్స్.. లెక్కు మించి లిప్ లాక్ లు వుండటంతో ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ రావడం కష్టమే.
అయితే అనుకున్న విధంగా ఈ మూవీకి యూత్ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం.. హిట్ టాక్ రావడంతో ఆ టాక్ ని గీతా ఆర్ట్స వర్గాలు ఎలా కాపాడుకుంటాయి.. దీన్ని మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ఎలాంటి ప్రచార సరళిని అనుసరిస్తుందన్నదే ఇప్పడు ఆపసక్తి కరంగా మారింది.
ఫస్ట్ డే పెద్దగా ఓపెనింగ్స్ ని రాబట్టలేకపోయిన ఈ యూవీ శనివారం నుంచి టాక్ ని బట్టి యూత్ ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తూ టికెట్ కౌంటర్ల వద్ద భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. చాలా ఏళ్ల తరువాత ఈ తరహా సినిమాకు ఆదరణ లభించడంతో ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. గతంలో కొన్నేళ్ల క్రితం యూత్ ని టార్గెట్ చేస్తూ తేజ 'చిత్రం' సినిమాని తెరకెక్కించాడు.
ఇందులో రిమా సేన్, ఉదయ్ కిరణ్ ల మధ్య చూపించిన ఇంటమేట్ సీన్స్.. అప్పట్లో యూత్ ని ఎట్రాక్ట్ చేయడమే కాకుండా ఈ తరహా సినిమాలు జోరందుకునేలా చేసింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత అతే తరహా కంటెంట్ కి మించిన సీన్ లతో 'ఊర్వశివో రాక్షసివో'ని తెరకెక్కించడం.. దానిని ప్రేక్షకులు ఆదరించడంతో మళ్లీ ఈ తరహా ఏ రేటెడ్ సినిమాలు జోరందుకునేలా వున్నాయే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.