Begin typing your search above and press return to search.

టాక్ సూప‌ర్ హిట్టు.. కానీ కలెక్ష‌న్ లే..!

By:  Tupaki Desk   |   8 Nov 2022 7:42 AM GMT
టాక్ సూప‌ర్ హిట్టు.. కానీ కలెక్ష‌న్ లే..!
X
ఓటీటీల ప్ర‌భావ‌మో లేక టిక్కెట్ రేట్లు, థియేట‌ర్ల‌కు రావ‌డం వ‌ల్ల పెరుగుతున్న ఖ‌ర్చుల ప్ర‌భావ‌మో ఏమో గానీ స్టార్స్ న‌టించిన సినిమాల‌కు ఈ మ‌ధ్య కాలంలో టాక్ కు త‌గ్గట్టుగా క‌లెక్ష‌న్ లు కావ‌డం లేదు. కొన్ని సినిమాల‌కు రికార్డు స్థాయిలో ఊహించ‌ని విధంగా వ‌సూళ్ల వ‌ర్షం కురుస్తుంటే మ‌రి కొన్ని సినిమాల‌కు మాత్రం టాక్ కు వ‌సూళ్ల‌కు సంబంధం వుండ‌టం లేదు. ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన 'కాంతార‌' ఎవ‌రూ ఊహించ‌ని విధంగా వ‌సూళ్ల సునామీని సృష్టించి మేక‌ర్స్ తో పాటు ట్రేడ్ పండితుల్ని ఆశ్చ‌ర్య ప‌రిచింది.

తెలుగు వెర్ష‌న్ ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు రూ. 40 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. అయితే ఇటీవ‌ల విడుద‌లైన తెలుగు సినిమాల ప‌రిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వుండ‌టం గ‌మ‌నార్హం. అల్లు శిరీష్ న‌టించి రొమాంటిక్ ల‌వ్ స్టోరీ 'ఊర్వ‌శివో రాక్ష‌సివో'. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా న‌టిచిన ఈ మూవీ రీసెంట్ గా విడుద‌లై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ టాక్ ని దృష్టి లో పెట్టుకున్న ట్రేడ్ వ‌ర్గాలు ఈ మూవీ డీసెంట్ వ‌సూళ్ల‌ని రాబ‌డుతుంద‌ని ఊహించారు.

ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ టాక్‌, విమ‌ర్శ‌కుల నుంచి సూప‌ర్ రెస్పాన్స్ తో పాటు మంచి రేటింగ్స్ ద‌క్క‌డంతో ఈ మూవీ ఖ‌చ్చితంగా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ఖాయం అని అంతా భావించారు. కానీ వాస్త‌వ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా క‌నిపిస్తోంది.

టాక్ బాగానే వున్నా అందుకు త‌గ్గ‌ట్టుగా వ‌సూళ్లు మాత్రం క‌నిపించడం లేదు. రాకేష్ శ‌శి డైరెక్ష‌న్ లో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన ఈ మూవీ ఆశించి స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంలో ఫెయిల్ అయిన‌ట్టుగా తెలుస్తోంది.

ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 3.75 కోట్ల గ్రాస్ ని మాత్ర‌మే వ‌సూలు చేసింది. ఎంత సూప‌ర్ హిట్ టాక్ వున్నా కానీ వ‌సూళ్ల ప‌రంగా ఆ స్థాయి క‌నిపించ‌క‌పోవ‌డం విచిత్రంగా వుంద‌ని ట్రేడ్ పండితులు అంటున్నారు. గ‌త శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ టాక్ కు ఏ మాత్రం సంబంధం లేని విధంగా వ‌సూళ్ల‌ని రాబ‌డుతుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అల్లు శిరీష్ న‌టించిన హిట్ మూవీ 'శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు' ఫ‌స్ట్ వీక్ లో రూ.9.9 కోట్ల గ్రాస్ ని, ఒక్క క్ష‌ణం రూ. 7 కోట్లు, ఏబీసీడీ రూ. 6 కోట్లు క‌లెక్ట్ చేస్తే 'ఊర్వ‌శివో రాక్ష‌సివో' అందులో స‌గం కూడా రాబ‌ట్ట‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో న‌వంబ‌ర్ 11న విడుద‌ల‌వుతున్న 'య‌శోద‌', 'బ్లాక్ పాంథ‌ర్ వాకండా ఫ‌రెవ‌ర్‌' ని త‌ట్టుకుని నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మ‌ని చెబుతున్నారు. ఈ ట‌ఫ్ కాంపిటీష‌న్ లో అల్లు శిరీష్ నిల‌బ‌డ‌తాడా?.. లేక వ‌న్ వీక్ తోనే స‌రిపెట్టుకుంటా? అన్న‌ది తెలియాలంటే న‌వంబ‌ర్ 11 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.