Begin typing your search above and press return to search.

వారిసు.. తునివు.. ఓటీటీ డీల్ క్లోజ్..!

By:  Tupaki Desk   |   11 Jan 2023 11:33 AM GMT
వారిసు.. తునివు.. ఓటీటీ డీల్ క్లోజ్..!
X
సంక్రాంతికి కోలీవుడ్ లో ఇద్దరు టాప్ హీరోల ఫైట్ ఓ రేంజ్ లో జరుగుతుంది. పొంగల్ రేసులో విజయ్ వారిసు, అజిత్ తునివు రెండు సినిమాలు బరిలో దిగాయి. అసలే ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య చాలా గొడవలు అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుండటం కూడా మరింత హైప్ తెచ్చుకునేలా చేశాయి. దళపతి విజయ్ వారిసు సినిమాను తెలుగు నిర్మాత, దర్శకులు చేశారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఎమోషనల్ గా మెప్పించేందుకు వచ్చింది వారిసు. ఇక అజిత్ తునివు మాత్రం మరోసారి ఆయన మార్క్ మాస్ అంశాలతో వచ్చింది. రెండు సినిమాలు తమిళం లో ఆల్రెడీ రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.

అయితే అక్కడ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ కాబట్టి రెండు సినిమాలు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే వారిసు, తునివు సినిమాల ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది.

వారిసు సినిమాను అమేజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. తునివు సినిమా ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రెండు సినిమాలకు ఓటీటీలో భారీ ధర పలికినట్టు తెలుస్తుంది. థియేట్రికల్ రిలీజ్ అయ్యాక అనుకున్న వారాలు ముగిసిన తర్వాతే ఈ సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతాయి. విజయ్, అజిత్ ఇద్దరు తమిళ్ లో సూపర్ స్టార్స్ కాగా ఈ ఇద్దరి సినిమాలు ఓకేసారి బాక్సాఫీస్ ఫైట్ లో దిగి కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సందడి షురూ చేస్తున్నారు.

ఇక వారిసు సినిమాను తెలుగులో వారసుడుగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వర్షన్ జనవరి 14న రిలీజ్ అవుతుంది. అజితు తునివు మాత్రం తెగింపుగా నేడు రిలీజైంది. అయితే తెలుగులో సరైన ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల తెగింపుకు ఓ మోస్తారు రెస్పాన్స్ మాత్రమే వస్తుంది. అదీగాకా గురు, శుక్రు వారాల్లో వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమాల మీద తెలుగు ఆడియన్స్ ఫోకస్ పెట్టారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.