Begin typing your search above and press return to search.
IAF ఆఫీసర్ గా వరుణ్.. VT13 తో మెగా ప్రిన్స్ బాలీవుడ్ ఎంట్రీ..!
By: Tupaki Desk | 19 Sep 2022 5:16 AM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన స్క్రిప్ట్స్ మరియు విలక్షణమైన పాత్రలతో ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పటి వరకూ తెలుగులోనే సినిమాలు చేస్తూ వచ్చిన వరుణ్.. ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. దీని కోసం #VT13 ప్రాజెక్ట్ ని ఎంచుకున్నాడు.
ఇటీవలే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని లాంచ్ చేసిన వరుణ్ తేజ్.. శనివారం తన 13వ సినిమాకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటన ప్రేరణతో యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని సూచించారు. అయితే ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ ఓపెనింగ్ ఈరోజు సోమవారం ఉదయం జరిగింది.
VT13 చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో యాడ్-ఫిల్మ్ మేకర్ గా సినిమాటోగ్రాఫర్ గా కూడా పని చేసిన ప్రతాప్ సింగ్.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. భారత వైమానిక దళం స్ఫూర్తితో ఓ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారు.
సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించనున్నారు. సోనీ పిక్చర్స్ వారు ఇటీవల 'మేజర్' వంటి బ్లాక్ బస్టర్ అందుకోగా.. వరుణ్ ఇంతకముందు రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్ లో 'గని' మూవీ చేసాడు.
వరుణ్ తేజ్ తన 13వ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. మెగా ప్రిన్స్ ఈ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో తన అరంగేట్రం చేయనున్నాడు. ఇది వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందిన దేశభక్తి సినిమా అని.. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్టైనర్ అని మేకర్స్ తెలిపారు.
భీకర వైమానిక దాడులలో మన హీరోలు ఎదుర్కొనే సవాళ్లను ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. తెలుగు మరియు హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతుంది. 2022 నవంబర్ లో ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని.. 2023లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోస్టర్ ని లాంచ్ చేశారు.
ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ''ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా నటించే అవకాశం రావడంతో పాటు బిగ్ స్క్రీన్ పై తమ శౌర్యాన్ని చాటుకునే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నాను. గ్లోబల్ దిగ్గజం సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ - సందీప్ ముద్దా మరియు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ లతో కలిసి వర్క్ చేయడానికి సంతోషిస్తున్నాను'' అని అన్నారు.
''మేము భారతీయ వైమానిక దళానికి పరిపూర్ణ నివాళిగా భావించే చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ స్క్రిప్ట్ నాకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. ఒక IAF ఆఫీసర్ గా కనిపించడానికి అపారమైన శిక్షణ పొందుతున్నాను. ప్రేక్షకులు దీనికి ఎలా స్పందిస్తారో చూడడానికి నేను సంతోషిస్తున్నాను'' అని వరుణ్ తేజ్ తెలిపారు.
ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందించడానికి వరుణ్ తేజ్ - శక్తి ప్రతాప్ సింగ్ మరియు సందీప్ ముద్దా కలిసి వచ్చినందున వారితో కలిసి పని చేయడం పట్ల మేము సంతోషిస్తునన్నాము అని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ జనరల్ మేనేజర్ లాడా గురుదేన్ సింగ్ అన్నారు.
ఈ సినిమా కేవలం యాక్షన్ మరియు హార్ట్ తో నిండిన అద్భుతమైన దృశ్యం మాత్రమే కాదు.. ఇది మునుపెన్నడూ లేని విధంగా భావోద్వేగాలను కూడా రేకెత్తిస్తుంది అని నిర్మాత సందీప్ ముద్దా చెప్పారు. ఈ సినిమా ప్రయాణంలో భాగమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. VT13 కు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.