Begin typing your search above and press return to search.

సంక్రాంతి పుంజులు ఢీకి రెడీ..TS ప్ర‌భుత్వం ట్విస్టు!

By:  Tupaki Desk   |   11 Jan 2023 4:01 AM GMT
సంక్రాంతి పుంజులు ఢీకి రెడీ..TS ప్ర‌భుత్వం ట్విస్టు!
X
వీరసింహా రెడ్డి వ‌ర్సెస్ వాల్తేరు వీరయ్య! ప్ర‌చార సంద‌డి మామూలుగా లేదు. మ‌రోవైపు పందెం పుంజులు నువ్వా నేనా అంటూ ఢీకొట్ట‌బోతున్నాయి. పందెం కాసేందుకు నంద‌మూరి అభిమానులు మెగాభిమానులు ఒక‌రికొక‌రు ధీటుగా రెడీ అవుతున్నారు.

రాత్రంతా జాగారం చేసి డే వ‌న్ లో ఉదయం 4 గంటలకు ప్రత్యేక షోలు వీక్షించేందుకు వీళ్లంతా రావాల్సి ఉంటుంది. ఈ చ‌లికాలంలో ఇది క‌ష్ట‌మే అయినా కానీ ఫ్యాన్స్ వేడి ముందు చ‌లీ గిలీ అన్నీ ఎగిరిపోతాయ్!

2023 సంక్రాంతికి విడుదలవుతున్న రెండు పెద్ద సినిమాలకు ఇప్పటికే మంచి బజ్ ఉంది. అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. ఏపీ- తెలంగాణ ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాలు టికెట్ రేట్ల పెంపుపై సానుకూలంగా ఉండ‌డం క‌లిసొచ్చే అంశం కాగా.. అగ్ర క‌థానాయ‌కుల‌ సినిమాలకు మరో లాభం చేకూరిందని తెలిసింది. బాలకృష్ణ వీరసింహా రెడ్డి - చిరంజీవి వాల్తేరు వీరయ్య విడుదల రోజున తెలంగాణ‌లో ఆరు షోలు వేసుకునేందుకు అనుమతిని సంపాదించాయి.

తాజాగా విడుదల చేసిన తెలంగాణ ప్ర‌భుత్వ ప్రత్యేక ఉత్తర్వులో 6వ షో రెండు సినిమాలకు అనుమ‌తించారు. తెల్లవారుజామున 4 గంటలకు స్పెషల్ షో వేసుకోవ‌చ్చ‌ని అనుమ‌తించారు. జనవరి 12న వీరసింహారెడ్డి- జనవరి 13న వాల్తేరు వీరయ్య విడుదల తేదీన‌ మాత్రమే ప్రభుత్వ అనుమతి వివ‌రాలు ఉండ‌డం కొంత ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తొలి వీకెండ్ తొలి వారం ఐదు షోల‌కు అనుమ‌తించారా లేదా? అన్న వివ‌రాలు ఇందులో లేవు.

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌.ఎల్‌.పి నిర్మాతలు లేవనెత్తిన అభ్యర్థనను కూడా ఆర్డర్ లో ప్రస్తావించారు. అన్ని అద‌న‌పు షోల‌కు ప‌న్నులు య‌థావిధిగా వ‌ర్తిస్తాయ‌ని కూడా పేర్కొన్నారు. ఏది ఏమైనా కానీ అద‌న‌పు షోల‌తో పెద్ద స్టార్స్ సినిమాల‌కు రిక‌వ‌రీ అమాంతం పెర‌గ‌నుంది. రిలీజ్ డేట్ లో మాత్ర‌మే ఈ స్పెషల్ షోలు వేస్తున్నాయి.

తొలివారంలో ఐదు షోల‌కు అనుమ‌తులు ఉన్నాయ‌ని చెబుతున్నారు. డే వ‌న్ లో మాత్రం తెలంగాణలో తెల్లవారుజామున 4 గంటలకు మెగా నంద‌మూరి అభిమానుల‌ హంగామా మొదలవుతుంద‌ని అంచ‌నా. టీఎస్ లో ఓకే. ఏపీలో అద‌న‌పు షోకి అనుమ‌తి ఉంటుందా లేదా? అన్న‌ది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.