Begin typing your search above and press return to search.

ముందే మొదలు పెట్టబోతున్న 'వీర సింహారెడ్డి'

By:  Tupaki Desk   |   26 Dec 2022 5:28 AM GMT
ముందే మొదలు పెట్టబోతున్న వీర సింహారెడ్డి
X
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యి మెల్ల మెల్లగా ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

ఇప్పటికే సినిమా నుండి విడుదల అయిన పాటలు.. పోస్టర్స్ మరియు టీజర్ సినిమా స్థాయిని పెంచేసిన విషయం తెల్సిందే. బాలయ్య ఈ సినిమాలో రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో బాలయ్య యొక్క మరో లుక్ ను సర్‌ ప్రైజ్ గా ఉంచారని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

వీర సింహారెడ్డి విడుదలకు అటు ఇటుగా మూడు వారాల సమయం ఉంది. ఇప్పటి నుండే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయాలని నిర్ణయించారట. రెండు వారాల పాటు ఏకదాటిగా బాలకృష్ణ సినిమా ప్రమోషన్‌ కోసం డేట్లు కేటాయించాడట. సాధ్యం అయినన్ని ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా బాలయ్య పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది.

బాలయ్య సినిమాకు పోటీగా సంక్రాంతికి చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య కూడా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కంటే ముందుగానే వీర సింహారెడ్డి సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల జోరు మొదలు అవ్వబోతుంది. సంక్రాంతి సినిమాల యొక్క హడావుడి ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

పోటీ తట్టుకునేందుకు కాస్త ఎక్కువ పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. అందుకే బాలయ్య ముందు జాగ్రత్తగా తన వంతు కృషి తాను చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. హీరోయిన్ గా ఈ సినిమా లో శృతి హాసన్ నటించిన విషయం తెల్సిందే. వీర సింహారెడ్డి సినిమా మరో అఖండ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందని బాలయ్య ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.