Begin typing your search above and press return to search.

'వీరసింహారెడ్డి'లో డబుల్ 'ధమాకా'..ఫ్యాన్స్ కు పూనకాలే..!

By:  Tupaki Desk   |   27 Oct 2022 7:30 AM GMT
వీరసింహారెడ్డిలో డబుల్ ధమాకా..ఫ్యాన్స్ కు పూనకాలే..!
X
#NBK107 పేరిట రాబోతున్న నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. 2023 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఒక స్పెషల్ సాంగ్ మినహా ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. దీంతో ఈ మూవీ సంక్రాంతి రావడం పక్కా అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

'వీరసింహారెడ్డి' టైటిల్ కు తగ్గట్టుగానే దర్శకుడు గోపీచంద్ మలినేని పుల్ లెన్త్ కామెడీ యాక్షన్ గా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా బ్యూటీపుల్ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తోంది. హనీ రోజ్.. వరలక్ష్మీ శరత్ కుమార్.. దునియా విజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

బాలకృష్ణ సినిమా అంటే భారీ ఫైట్స్.. యాక్షన్ సన్నివేశాలు ఉండటం కామన్. అయితే ఈ సినిమాలో అంతకు మించి రెండు బిగ్ సర్ ప్రైజ్ లు ఉండనున్నాయట. థియేటర్లలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఊర్రూతలూగేలా దర్శకుడు గోపీచంద్ మలినేని రెండు స్పెషల్ సాంగ్స్ ను ఈ సినిమాలో పెట్టినట్లు తెలుస్తోంది.

భారత సంతతికి చెందిన ఆస్టేలియన్ మోడల్ చంద్రికా రవి 'వీరసింహారెడ్డి'లో ఓ ఐటమ్ సాంగ్ చేయనుందట. ఈ భామ ఇప్పటికే పలు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో తళుక్కుమంది. తెలుగులోనూ 'చీకటి గదిలో చితకొట్టుడు' మూవీలో గెస్ట్ రోల్ చేసి ఆకట్టుకుంది. తాజాగా 'వీరసింహారెడ్డి'లో ఐటమ్ సాంగ్ చేసే బంపరాఫర్ దక్కించుకుంది. ఈ పాట షూటింగ్ సైతం ఇటీవలే పూర్తయింది.

అలాగే శృతిహాసన్.. బాలకృష్ణలపై ఓ స్పెషల్ సాంగ్ పెండింగ్ లో ఉందట. ఈ పాటలో మరో నటిని తీసుకోనున్నారని టాక్. ఇద్దరు ముద్దుగమ్మలతో బాలయ్య ఆడిపాడుతుంటే ఆ కిక్కే వేరని అంటున్నారు. దీంతో ఆ లక్కీ ఛాన్స్ దక్కించుకునే మరో నటి ఎవరా? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ స్పెషల్ సాంగ్ మినహా 'వీరసింహారెడ్డి' షూటింగు మొత్తం కంప్లీట్ అయిందని సమాచారం.

ఇక త్వరలోనే డబ్బింగ్ పనులు పూర్తి చేసుకోనుంది. 2023 సంక్రాంతి రేసులో నిలిచిన 'వీరసింహారెడ్డి'కి పోటీగా మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' రానుంది. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్సే నిర్మించడంతో సంక్రాంతికి ఒకట్రెండు రోజుల గ్యాప్ తేడాతో ఈ చిత్రాలు వచ్చే అవకాశం కన్పిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.