Begin typing your search above and press return to search.

'విడుదల' బాక్సాఫీస్.. గట్టిగానే లాగుతోంది!

By:  Tupaki Desk   |   17 April 2023 6:00 AM GMT
విడుదల బాక్సాఫీస్.. గట్టిగానే లాగుతోంది!
X
డబ్బింగ్ సినిమాలకి ఈ మధ్యకాలంలో తెలుగులో మంది బజ్ క్రియేట్ ఆవుతోన్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. తరువాత కాంతారా మూవీ కూడా కన్నడం నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే డిజిటల్ మీడియాలో ఇతర భాషా సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి తెలుగు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే అల్లు అరవింద్ ఆహా కోసం చాలా మలయాళీ సినిమాలు, తమిళ్ మూవీస్ తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలాగే కాంతార మూవీ కూడా గీతా ఫిలిమ్స్ డిస్టిబ్యూటర్ నుంచి తెలుగులోకి వచ్చింది. తాజాగా వెట్రిమారన్ సూపర్ హిట్ తమిళ్ మూవీ విడుతలై 1ని తెలుగులో విడుదల పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు.

కమెడియన్ సూరి ఈ మూవీలో లీడ్ రోల్ లో కనిపించడం విశేషం. అలాగే విజయ్ సేతిపతి కూడా కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా తెలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టింది.

మొదటి రోజు ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పెద్దగా ప్రమోషన్ లేకుండానే 1.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. శాకుంతలం మూవీ డివైడ్ టాక్ రావడంతో మరో వారం రోజుల వరకు ప్రేక్షకులని మెప్పించే సినిమా విడుదల ఒక్కటే ఉంది. ఈ నేపధ్యంలో ఆ సినిమాకి మౌత్ టాక్ తో ప్రేక్షకాదరణ పెరుగుతోంది అని అంచనా వేస్తున్నారు.

మరి లాంగ్ రన్ లో ఈ సినిమా కాంతారా స్థాయిలో అద్భుతం చేయకపోయినా కచ్చితంగా అల్లు అరవింద్ కి మంచి లాభాలు తెచ్చిపెట్టే సినిమా అవ్వొచ్చని భావిస్తున్నారు. ఇక సూరికి హీరోగా విడుదలతో మంచి ప్రమోషనల్ లభించింది అనే మాట ఇప్పుడు సౌత్ లో వినిపిస్తోంది.