Begin typing your search above and press return to search.
డైరెక్టర్ మృణాల్.. విజయ్ సినిమాలో ట్విస్ట్..!
By: Tupaki Desk | 23 Jun 2023 12:31 PM GMTరౌడీ హీరో విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. ఆల్రెడీ విజయ్ తో గీతా గోవిందం సినిమా చేసిన పరశురామ్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. విజయ్ ని మొదట 100 కోట్లు హీరో చేసింది పరశురామే. ఇక వీరి కాంబినేషన్ లో మరో సినిమా అనగానే ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. విజయ్ పరశురాం గీతా గోవిందం ఒక రొమాంటిక్ యూత్ ఎంటర్టైనర్ గా నిలిచింది. వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ లవ్ స్టోరీగా వస్తుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో మృణాల్ ఉంది అనగానే సినిమాలో హీరోయిన్ పాత్రకు వెయిట్ ఎక్కువ ఉంటుందని ఫిక్స్ అయ్యారు. పరశురాం కూడా తన సినిమాలో హీరోయిన్ పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు.
ఈ క్రమంలో విజయ్ దేవరకొండ సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక సినిమా గురించి వచ్చిన లీక్స్ ప్రకారం మృణాల్ ఒక డాక్యుమెంటరీ తీసేందుకు యూఎస్ నుంచి ఇండియా వస్తుందట. ఆమె డాక్యుమెంటరీ డైరెక్టర్ గా సినిమాలో నటిస్తుందట.
ఇక్కడ విజయ్ హెల్ప్ తో ఆమె తన డాక్యుమెంటరీ తీయాలని అనుకుంటుంది. అయితే ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన విజయ్ ఆమెను ఇష్టపడతాడు. అలా వారి ప్రేమను గెలిపించుకునేందుకు వారు ఎలా కష్టపడ్డారు అన్నది సినిమా కథ అని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా కుటుంబరావు పరిశీలనలో ఉంది. ఈ సినిమాకు ఇదే మంచి టైటిల్ అని చిత్ర యూనిట్ భవిస్తున్నారట.
విజయ్ దేవరకొండ మృణాల్ ల జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. అంతేకాదు పరశురాం వీరి మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా కొత్తగా రాసుకున్నాడట. తప్పకుండా విజయ్ కి ఇది మరో గీతా గోవిందం కాదు కాదు అంతకుమించిన ఫలితాన్ని ఇస్తుందని అంటున్నారు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కేవలం తెలుగు రిలీజ్ మాత్రమే ఉంటుందా పాన్ ఇండియా రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. విజయ్ లైగర్ తర్వాత కథల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రాబోతుంది. ఆ సినిమాలో విజయ్ సరసన సమంత ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.