Begin typing your search above and press return to search.
వీరయ్య నేపథ్యం 1980..అందుకేనా అంత ఊరమాస్!
By: Tupaki Desk | 29 Dec 2022 2:30 PM GMT'వాల్తేరు వీరయ్య' గురించి మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారో తెలుసుగా? ఇది పక్కా మాస్ చిత్రం. ఒకప్పుడు మాస్ చిరంజీవిని తెరపై చూస్తారన్నారు. ఇలాంటి సినిమా చేసి కొన్ని దశాబ్ధాలు అవుతుంది. అందుకే ఈ కథ మెచ్చి చేసిన చిత్రంగా చెప్పుకొచ్చారు. ఇటీవలే సినిమాలో బలమైన ఎమోషన్ ఉందని...అదే సినిమాకి ఆయువు పట్టు అని కూడా అన్నారు.
ఇక ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు బాబి తనని దర్శకుడిలా కాకుండా.. ఓ అభిమానిగా మారిపోయి వీరయ్యని తెరకెక్కించానన్నారు. సినిమా ప్రారంభానికి ముందే ఇది ఊర మాస్ సినిమా అని ముందే హింట్ ఇచ్చేసారు బాబి. దీంతో వీరయ్య పక్కా కమర్శియల్ ఎంటర్ టైనర్ అని తేలిపోయింది. ఇక్కడి వరకూ వీరయ్య ఒకే.
మరి ఇంత మాస్ వీరయ్య నేపథ్యం కోసం ఎన్ని దశాబ్ధాల క్రితం వరకూ వెళ్లారంటే? చాలా సంగతులే తెలుస్తున్నాయి. ఇది కొద్ది భాగం 1980 బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ అట. అక్కడ నుంచి కథ 2022 కి షిప్ట్ అవుతుందిట. 1980 కాలంలో జాలర్లు ఎలాంటి వేషాధారణలో ఉండేవారో? అలాంటి లుక్ లో చిరు కనిపించనున్నారుట. పూర్తిగా విశాఖ వాల్తేరు నేపథ్యంలో సాగే స్టోరీ అని ముందే చెప్పేసారు.
కాబట్టి అక్కడ నేపథ్యాన్ని ..పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని రాసుకున్న కథ. ఆరకంగా 1980 ప్లస్ 2022 మత్సకారుల కథగా వీరయ్య ని హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 1980 సన్నివేశాలు ఎక్కువగా ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చూపించడానికి అవకాశం ఉంది.
మరి ఆదశాబ్ధాన్ని ఎలా మలుస్తారు? అన్నది మరో ఆసక్తికర విషయం. ఈ కథకే బలమైన మోషన్ అద్దినట్లు తెలుస్తోంది. అలాగే అప్పటి కొన్ని వాస్తవ సంఘటనలు ఈ కథకు పురుడు పోసినట్లు వినిపిస్తుంది. ఇక కథలో కొత్తదనం ఉండదని ముందే చెప్పేసారు కాబట్టి..కొత్తదనం ఆశించి వెళ్లాల్సిన పనిలేదు. చిరంజీవి..మాస్ లుక్..ఎమోషన్...కుటుంబ నేపథ్యం...కమర్శియల్ అంశాలున్న సినిమాగా తెలుస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.