Begin typing your search above and press return to search.

ఫైన‌ల్ గా ఇండియా రేస్ కు సామ్ కూడా రెడీ!

By:  Tupaki Desk   |   17 Oct 2022 11:24 AM GMT
ఫైన‌ల్ గా ఇండియా రేస్ కు సామ్ కూడా రెడీ!
X
క్రేజీ హీరోయిన్ స‌మంత న‌టిస్తున్న సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'య‌శోద‌'. హ‌రి, హ‌రీష్ ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీ‌దేవి మూవీస్ బ్యాన‌ర్ పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ గ‌త కొన్ని నెల‌లుగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో రూపొందిన ఈ మూవీని ద్వి భాషా చిత్రంగా ఈ రెండు భాష‌ల్లో రిలీజ్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపించాయి.

కానీ ఫైన‌ల్ గా ఇత‌ర స్టార్ హీరోల‌తో పాటు పాన్ ఇండియా రేసులో ఈ మూవీతో బ‌రిలోకి దిగుతున్న‌ట్టుగా సామ్ ఇండైరెక్ట్ గా ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ అంశాల నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీని ఎట్ట‌కేల‌కు ఈ న‌వంబ‌ర్ 11న విడుద‌ల చేస్తున్న‌ట్టుగా చిత్ర బృందం సోమ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ మూవీని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీని ఈ ఐదు భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో స‌మంత దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుక‌న్న విష‌యం తెలిసిందే. అంతే కాకుండా అల్లు అర్జున్ న‌టించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప‌'లో 'ఊ అంటావా మావ‌.. ఊ హూ అంటావా..' అంటూ పాన్ ఇండియా వైడ్ గా ఊహించ‌ని పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఇక 'య‌శోద‌' మూవీ రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న కోసం చిత్ర బృందం యునిక్ ఐడియాని ఉప‌మోగించి వినూత్నంగా ఫ్యాన్స్ ని ఇందులో భాగం చేశారు. మొద‌టి నుంచి క‌థ‌, క‌థ‌నం, టీజ‌ర్ రిలీజ్, ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ విష‌యంలో వినూత్న పంథాని అనుస‌రిస్తున్న చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించే విష‌యంలోనూ అదే పంథాని అనుస‌రించి స‌ర్ ప్రైజింగ్ డేట్ ని ప్ర‌క‌టించింది. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ లో వేలాది మంది ఫ్యాన్స్ పాల్గొన్నారు.

మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో ఉన్ని ముకుంద‌న్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌, రావు ర‌మేష్‌, సంప‌త్ రాజ్‌, ముర‌ళీ శ‌ర్మ‌, శ‌త్రు త‌దిత‌రులు న‌టించారు. ఇదిలా వుంటే స‌మంత న‌టించిన మ‌రో సినిమా 'శాకుంత‌లం' కూడా రిలీజ్ కి రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. 3డీ ఫార్మాట్ లోనూ విడుద‌ల కానున్న ఈ మూవీని త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.