Begin typing your search above and press return to search.

కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ లిస్ట్..!

By:  Tupaki Desk   |   16 Feb 2022 10:34 AM GMT
కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ లిస్ట్..!
X
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. పరిస్థితులు సానుకూలంగా మారుతుండటంతో వరుసగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి సీజన్ లో వాయిదా పడిన అనేక పెద్ద చిత్రాలు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నెలాఖరు నుంచి సమ్మర్ ఎండింగ్ వరకు ప్రతీవారం ఓ పెద్ద సినిమా అనే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ముందుగా ప్రకటించిన తేదీల్లో కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మంగళవారం 'భీమ్లా నాయక్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో చాలా సినిమాలు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. రాబోయే మూడు నెలల్లో రాబోయే సినిమాల విడుదల తేదీలను ఇప్పుడు పరిశీలిద్దాం!

మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో డైమండ్ రత్నం తెరకెక్కించిన 'సన్నాఫ్ ఇండియా' చిత్రం ఫిబ్రవరి 18న విడుదల కానుంది. తమిళ హీరో అజిత్ కుమార్ నటించిన 'వలిమై' చిత్రాన్ని తెలుగు తమిళంతో పాటుగా పలు భాషల్లో ఫిబ్ర‌వ‌రి 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసారు. పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందిన 'భీమ్లా నాయక్' చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 25న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన అలియా భట్ 'గంగూబాయి' సినిమా కూడా ఫిబ్రవరి 25వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శర్వానంద్ - రష్మిక మందన్నా జంటగా కిషోర్ తిరుమల రూపొందించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాని ఈ నెల 25వ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడు పవన్ సినిమా వస్తుండటంతో.. ఏప్రిల్ 8కి ఈ చిత్రాన్ని వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్ నడుస్తోంది.

ఫిబ్ర‌వ‌రి 25న రావాల్సిన కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్' సినిమాని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు. తదుపరి రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటించనున్నారు. వరుణ్ తేజ్ నటించిన 'గ‌ని' చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 25న విడుదల చేయాలని మేకర్స్ ముమ్మరంగా ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు భీమ్లా రాకతో.. వరుణ్ వెనక్కి తగ్గి మార్చి 4న బాక్సింగ్ రింగ్ లో దిగుతాడని టాక్ వినిపిస్తోంది. విశ్వక్ సేన్ 'అశోక వనంలో అర్జున కల్యాణం' చిత్రాన్ని కూడా మార్చి 4న విడుదల చేయాలని చూస్తున్నారని సమాచారం.

కోలీవుడ్ హీరో సూర్య నటించిన 'ఈటీ' చిత్రాన్ని నాలుగు దక్షిణాది భాషల్లో మార్చి 10న విడుదల చేయనున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన పాన్ ఇండియా లవ్ డ్రామా 'రాధేశ్యామ్' మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. దివంగత పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం 'జేమ్స్' మార్చి 17న అన్ని భాషల్లో విడుదల కానుంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా మార్చి 25న థియేటర్లోకి రాబోతోంది. రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని కుదిరితే మార్చి 25 కుదరకపోతే ఏప్రిల్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీయఫ్: చాప్టర్ 2' చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' చిత్రాన్ని ఏప్రిల్ 29న థియేటర్లలోకి తీసుకురానున్నారు. నాని 'అంటే సుందరానికీ' సినిమాని మే 6న రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్. మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కే 'సర్కారు వారి పాట' సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. గోపీచంద్ హీరోగా మారుతి రూపొందిస్తున్న 'పక్కా కమర్షియల్' మూవీ మే 20న రాబోతోంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ - వరుణ్ తేజ్ కలిసి నటించిన 'ఎఫ్ 3' చిత్రాన్ని మే 27న థియేటర్లలోకి తీసుకురానున్నారు. మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న 'మేజర్' మూవీని పాన్ ఇండియా స్థాయిలో మే 27న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటుగా తమిళ్ హీరో విజయ్ నటించిన 'బీస్ట్' - నాగచైతన్య 'థాంక్యూ' వంటి పలు క్రేజీ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించనున్నారు.

కొత్త సినిమాలు - అప్‌డేటెడ్ రిలీజ్ డేట్స్:

సన్నాఫ్ ఇండియా : ఫిబ్రవరి 18

వలిమై : ఫిబ్రవరి 24

భీమ్లా నాయక్ : ఫిబ్రవరి 25

గంగూభాయి కతియావాడి: ఫిబ్రవరి 25

గని: మార్చి 4 (ధృవీకరించబడలేదు)

అశోకవనంలో అర్జున కల్యాణం : మార్చి 4

ఈటీ : మార్చి 10

రాధే శ్యామ్: మార్చి 11

RRR : మార్చి 25

ఆడవాళ్లు మీకు జోహార్లు : ఏప్రిల్ 8 (ధృవీకరించబడలేదు)

KGF: చాప్టర్ 2 : ఏప్రిల్ 14

రామారావు ఆన్ డ్యూటీ : ఏప్రిల్ 15

ఆచార్ య: ఏప్రిల్ 29

అంటే సుందరానికి : మే 6 (ప్రకటించాల్సి ఉంది)

సర్కారు వారి పాట : మే 12

పక్కా కమర్షియల్ : మే 20

F3 : మే 27

మేజర్ : మే 27