Begin typing your search above and press return to search.

వాళ్ల ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   9 Aug 2022 8:04 AM GMT
వాళ్ల ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది?
X
బాలీవుడ్ స్టార్‌ సల్మాన్ ఖాన్‌ మరియు నటి షెహనాజ్ గిల్ మధ్య ఏం జరుగుతోంది అంటూ గత రెండు రోజులుగా సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో తెగ చర్చ జరుగుతోంది. అంతే కాకుండా సల్మాన్‌ ఖాన్‌ అభిమానులతో పాటు ఇతర నెటిజన్స్ కూడా సల్మాన్ ఖాన్‌ తో షెహనాజ్ గిల్ కి ఇప్పటి వరకు ఏం ఉంది.. ఇప్పుడు వారిద్దరి మధ్య ఏం జరిగింది.. జరుగుతోంది అంటూ చర్చించుకుంటున్నారు.

ఈ చర్చకు అసలు కారణం ఏంటీ అంటే... బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ షెహనాజ్ గిల్ ను సల్మాన్ ఖాన్ ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఆమె కూడా సల్మాన్ తన మెంటర్ అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేది కూడా అప్పట్లో గుసగుసల వచ్చింది. ఆ విషయం గురించి ఆ తర్వాత మళ్లీ ఎలాంటి క్లారిటీ లేదు.

షెహనాజ్ గిల్ కు తన కబీ ఈద్ కబీ దీవాళి సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఆమె షూటింగ్‌ లో పాల్గొన్న సమయంలో తీసుకున్న ఫోటోలు మరియు వీడియోలను రెగ్యులర్ గా ఇన్ స్టా లో షేర్ చేస్తూ వచ్చింది.

హీరోయిన్‌ గా కాకున్నా కూడా కీలక పాత్రలో ఈమె సల్మాన్ సినిమాలో నటించబోతున్న నేపథ్యంలో ఈమె స్టార్‌ డమ్‌ భారీగా పెరిగే అవకాశం ఉందని అంతా భావించారు. సల్మాన్ సినిమా తర్వాత షెహనాజ్ గిల్ బాలీవుడ్‌ లో బిజీ అయ్యే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

ఈ సమయంలో షెహనాజ్ గిల్ ను కబీ ఈద్ కబీ దీవాళి సినిమా నుండి తప్పించారనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లుగా ఈ అమ్మడు ఇన్ స్టా లో సల్మాన్ ఖాన్‌ ను అన్‌ ఫాలో అయ్యింది. దాంతో ఇద్దరి మధ్య ఏదో జరిగింది. ఆ కారణంగానే ఆమెను సినిమా నుండి సల్మాన్‌ తప్పించాడు.. ఆమె ఇన్ స్టా లో సల్మాన్‌ ను అన్‌ ఫాలో అయ్యింది అంటూ టాక్ వినిపిస్తుంది.

అసలు విషయం ఏంటి అనేది వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కాని బాలీవుడ్‌ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తూ అసలు విషయం ఏంటి అనే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.