Begin typing your search above and press return to search.
'ధమాకా' ధమ్కీ గెస్ చేసారా?
By: Tupaki Desk | 25 Dec 2022 7:03 AM GMTమాస్ రాజా రవితేజ కథానాయకుడిగా నటించిన `ధమాకా` ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. రివ్యూలు ఏమంత పాజిటివ్ గా లేవు. అంతకు ముందు సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ వీక్ గానే కనిపించాయి. దీంతో ఒకింత షాక్ అవ్వాల్సి వచ్చింది. మాస్ రాజా సినిమా ఇంత వీక్ గా ఫిల్ అవుతుందని! కొన్ని రకాల డౌట్లు కొట్టాయి. దీంతో యూనిట్ లోనే కాస్త టెన్షన్ షురూ అయింది.
కానీ రిలీజ్ రోజు మాత్రం పెద్ద ధమ్కీ ఇచ్చింది ధమాకా. థియేటర్ల వద్ద సందడి బాగానే కనిపించింది. ఆన్ లైన్ లో వీక్ గా అనిపించినా....ఆఫ్ లైన్ మోడ్ లో హడావుడి గట్టిగానే కనిపించింది. మార్నింగ్ షోలు చాలా చోట్ల ఫుల్ అయ్యాయి. తొలి షో అనంతరం డివైడ్ టాక్ వచ్చినా అదే ఊపు తదుపరి షోల్లోనూ కనిపించింది. ఆరకంగా మొదటి ఆట..రెండవ ఆటలు మంచి ఆక్యుపెన్సీతో నడిచాయి.
దీన్నే రవితేజ ఇచ్చిన `ధమ్కీ` అనాలేమో. సాధారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువగా ఉండి.. పాజిటివ్ రివ్యూలు తెచ్చుకోని సినిమా సాయంత్రానికి ఖాళీ అయిపోతుంది. కానీ ధమాకా విషయంలో రివర్స్ లో జరుగుతోంది. మాస్ కంటెంట్ తో ఫ్యాన్స్ ఫిదా అయినట్లు కనిపిస్తుంది. రివ్యూలతో సంబంధం లేకుండా సినిమా రన్నింగ్ లో ఉంది. కమర్శియల్ కంటెంట్ కి ప్రేక్షకులు పట్టాభిషేకం చేస్తున్నట్లే సన్నివేశం కనిపిస్తుంది.
మొదటి రోజు ఏకంగా తొమ్మిది కోట్లు గ్రాస్ తేవడం చూసి ట్రేడ్ సైతం షాక్ అయిందిట. ఇది రవితేజ మాస్ ఫాలోయింగ్ నిదర్శనంగా చెప్పొచ్చు. ఇటీవలి కాలంలో ఆయన హీరోగా నటించిన సినిమాలు మొదటి ఆటతోనే థియేటర్లో లేకుండా పోతున్నాయి. ప్లాప్ టాక్ వచ్చిందంటే? మరుక్షణం సినిమాని థియేటర్ నుంచి తొలగిస్తున్నారు. తొలి షోతోనే సత్తా లేని కంటెంట్ గా జనాల్లోకి వెళ్లిపోతుంది.
కానీ `ధమాకా` విషయంలో త్రినాధరావు నక్కిన మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. ఆయన గత సినిమాలు కూడా రొటీన్ గానే అనిపించాయి. కథ కోసం ఆయనేమి పెద్ద సాహసాలు ..కుస్తీలు పట్టనని ముందే చెప్పేస్తారు. రొటీన్ కథతోనే హిట్ అందుకోవడం ఈ మద్య కాలంలో ఆయనకే చెల్లింది. ఇంత వరకూ త్రినాధరావుకి ప్లాప్ లేదు. `ధమాకా` విషయంలోనూ అది రుజువవుతున్నట్లే ఉంది.