Begin typing your search above and press return to search.
చిరంజీవికి 'ఆచార్య' ఎలాగో.. రవితేజకు 'రామారావు' అలాగా..?
By: Tupaki Desk | 30 July 2022 7:35 AM GMTమాస్ మహరాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ''రామారావు ఆన్ డ్యూటీ'' నిన్న శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది. శరత్ మండవ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ రూపొందించిన ఈ సినిమా తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఫ్యాన్స్ సైతం ఈ మూవీతో ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు. అసలు మాస్ రాజా నుంచి ఇలాంటి సినిమాని ఎక్సపెక్ట్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు.
సాధారణంగా రవితేజ తన సినిమాల్లో ఉత్సాహభరితమైన నటనతో.. తనదైన శైలి కామెడీ మరియ ఎమోషన్స్.. డ్యాన్సులు.. మాస్ ఫైట్లు.. ఇలా ప్రతీ అంశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ప్లాప్ అయినా కొన్ని సన్నివేశాలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటాయి. అందుకే ఫ్యాన్స్ అతన్నించి అలాంటి ఎనర్జిటిక్ సినిమాలనే ఆశిస్తుంటారు. కానీ 'రామారావు' లో అభిమానులు ఆశించే ఏ ఒక్క అంశమూ లేకపోవడం వారిని నిరాశ పరుస్తోంది.
రామారావు టీజర్ ట్రైలర్ ప్రోమోలతోనే రవితేజ మార్కు మాస్ మసాలా సినిమాలకు భిన్నంగా.. కంటెంట్ బేస్డ్ థ్రిల్లర్ లాగా ఉంటుందని అనిపించింది. కంటెంట్ రిచ్ స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ అని దర్శకుడు చెబుతూ వచ్చాడు. దీంతో రవితేజ టైప్ సినిమా కాకపోయినా.. కచ్చితంగా ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని అందరూ భావించారు. కానీ రామారావు ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి కి 'ఆచార్య' ఎలాగో.. రవితేజ కు 'రామారావు' ఆలాగా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో చిరు ఎన్నడూ లేని విధంగా సబ్టిల్ యాక్టింగ్ తో అలరించడానికి ప్రయత్నించారు. కానీ స్క్రీన్ మీద మరీ డల్ గా కనిపించాడు.. నటనలో ఏమాత్రం ఉత్సాహమే లేదు. అసలు నటించాడని అసలు స్కోప్ లేదు. దీనికి కారణం మెగాస్టార్ తన స్టైల్ ని పక్కనపెట్టి.. పూర్తిగా కొరటాల శైలిలోకి మారిపోవడమే అని చెప్పవచ్చు.
ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో రవితేజ పాత్ర కూడా అలానే సాగిందని అంటున్నారు. మాస్ రాజా తన శైలిని పక్కన పెట్టి.. పూర్తిగా దర్శకుడికి సరెండర్ అయినట్లు అనిపిస్తుంది. మిగతా కమర్షియల్ సంగతి పక్కన పెడితే.. అసలు రవితేజ ఎనర్జీని చూపించే సీన్ ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తోంది. అందుకే ఏ దశలోనూ రామారావు పాత్రతో కనెక్ట్ కాలేకపోతున్నారు.
నిజానికి గత కొంతకాలంగా రవితేజ సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ‘క్రాక్’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడని సంబరపడే లోపే.. 'ఖిలాడి' వంటి పరాజయం పలకరించింది. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలన్న పట్టుదలతో.. తన స్టయిల్ ని పక్కన పెట్టి.. డిఫరెంట్ కాన్సెప్ట్ అంటూ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా చేశాడు. కానీ ఈసారి కూడా మాస్ రాజా కు నిరాశే ఎదురైంది.
రవితేజ అసలేం చూసి ఈ కథను ఓకే చేశాడని అభిమానులే ప్రశ్నిస్తున్నారంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 'ఆచార్య' సినిమా విషయంలోనూ మెగా ఫ్యాన్స్ ఇలానే డిజప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు రామారావు తో కంపేరిజన్ చేస్తూ.. ఇద్దరూ తమకి ఏమాత్రం నప్పని పాత్రలు చేశారని కామెంట్స్ చేస్తున్నారు. తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో మళ్లీ ఇలాంటి పొరపాట్లు చేయకూడదని కోరుకుంటున్నారు. యాదృచ్చికంగా ఇప్పుడు చిరంజీవి - రవితేజ కలిసి 'వాల్తేరు వీరయ్య' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.