Begin typing your search above and press return to search.
ఆ ప్రొడ్యూసర్ కి ఇంకో సినిమా చేస్తాడంట!
By: Tupaki Desk | 4 Aug 2022 2:30 AM GMTఇండస్ట్రీలో ఫ్లాపులు, డిజాస్టర్లు కామన్. అయితే భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో విడుదలైన స్టార్స్ సినిమాలు హ్యూజ్ లాస్ ని అందించినప్పుడు కొంత మంది హీరోలు ఆ లాస్ ని భర్తీ చేయడం కోసం తమకు నిర్మాత అందించిన పారితోషికంలోంచి కొంత రిటర్న్ చేస్తుంటారు. అది నిర్మాతలకు ఎంతో కొంత లాస్ ని కవర్ చేస్తూ వుంటుంది. ఈ సంప్రదాయాన్ని కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ముందు మొదలు పెట్టారు. తను నటించిన `బాబా` మూవీ భారీ క్రేజ్ ని సొంతం చేసుకోవడంతో బయ్యర్లు ఎగబడి ఫ్యాన్సీ రేట్లకు కొన్నారు.
`బాషా` ఫేమ్ సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఊహించని విధంగా భారీ నష్టాలని తెచ్చిపెట్టింది. సినిమా తీసుకున్న బయ్యర్లని కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో చాలా మంది బయ్యర్లు భారీ నష్టాల్లో కూరుకుపోయారు. అయితే వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్న రజనీకాంత్ ఈ క్రమంలో తన పారితోషికాన్ని నిర్మాతలకు రిటర్న్ ఇచ్చేశారు. దీంతో కొంత వరకు డిస్ట్రిబ్యూటర్లు నష్టాల నుంచి గట్టెక్కారు. ఇదే సంప్రదాయాన్ని ఇటీవల `ఆచార్య` మూవీ విషయంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ పాటించారని వార్తలు వినిపించాయి.
మేకర్స్ కి దాదాపు 20 కోట్ల పైనే తమ పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారని వార్తలు వినిపించాయి. రీసెంట్ గా విడుదలైన `ఆచార్య` అనూహ్యంగా భారీ డిజాస్టర్ మూవీగా నిలిచింది. దీంతో బయ్యర్లు భారీ స్థాయిలో నష్టాల బాట పట్టారు. వారిని ఆదుకునే క్రమంలో చిరు, చరణ్ తమ రెమ్యునరేషన్ లో కొంత భాగాన్నితిరిగి ఇచ్చేశారట. ఇదే తరహాలో మాస్ మహారాజా రవితేజ తన పారితోషికాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాడని ప్రచారం జరుగుతోంది. రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ `రామారావు ఆన్ డ్యూటీ`. ఈ సినిమాకు రవితేజ రెమ్యునరేషన్ కింద భారీగానే తీసుకున్నారట.
శరత్ మండవ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్ గా విడుదలై డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. అడ్వాన్స్ బేసిస్ లో సినిమాని నిర్మాత పలు ఏరియాల్లో ఓన్ గా రిలీజ్ చేశారు. దీంతో భారీగా నష్టాపోయారట. దీంతో తీసుకున్న అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేశారట. అయితే ఆ నష్టాన్ని భర్తీ చేయడంలో భాగంగా హీరో రవితేజ తన పారితోషికాన్ని నిర్మాతకు రిటర్న్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిసింది. తను తీసుకున్న పారితోషికం నుంచి రవితేజ ఎలాంటి రిటర్న్స్ చేయలేదని, అయితే మరో సినిమా చేస్తానని కమిట్ అయ్యాడని, అంతే కాకుండా సేమ్ రెమ్యునరేషన్ కే మరో సినిమా చేస్తానని చెప్పారని తెలుస్తోంది.
దీంతో రవితేజ హీరోగా ప్రదీప్ తో `30 రోజుల్లో ప్రేమించడం ఎలా?` అనే మూవీని రూపొందించిన మున్నాతో నెక్స్ట్ మూవీని రూపొందించాలని నిర్మాత చెరుకూరి సుధాకర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఎంటైర్ ఎపిసోడ్ గమనించిన వాళ్లంతా రవితేజ ఏమైనా రజనీకాంతా రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వడానికి అంటూ సెటైర్లు వేస్తున్నారట. రవితేజ ప్రస్తుతం స్టూవర్ట్ పురం గజదొంగగా పాపులర్ అయిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న`టైగర్ నాగేశ్వరరావు` వంటి పాన్ ఇండియా మూవీతో పాటు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న`రావణాసుర`, త్రినాథరావు నక్కిన రూపొందిస్తున్న `ధామాకా` చిత్రాల్లో నటిస్తున్నాడు.