Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ల సినిమాలకు నో బ్రేక్?
By: Tupaki Desk | 2 Aug 2022 11:35 AM GMTగత కొంత కాలంగా టాలీవుడ్ లో వున్న ప్రొడ్యూసర్లం అంతా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కరోనా తరువాత వచ్చిన మార్పుల కారణంగా ప్రేక్షకులలో విప్లవాత్మక మార్పులొచ్చాయిని, ఓటీటీ ప్రభావం కూడా పెరిగిందని దీంతో మేము పెట్టిన పెట్టుబడికి రాబడికి ఎక్కడా పొంతన కుదరడం లేదంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ కు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ బంద్ పూర్తిగా కాకుండా పాక్షికంగానే జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
ముందు షూటింగ్ ల బంద్ కు అంగీకరించని నిర్మాతల మండలి ఎట్టకేలకు జూలై 31న గిల్డ్ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కొన్నాళ్ల పాటు షూటింగ్ లు నివధికంగా ఆపు చేయడమే మంచిదని ఏకాభిప్రాయానికి వచ్చిన నిర్మాతలు ఫైనల్ గా బంద్ కు పిలుపునిచ్చారు.
అయితే అది అనుకున్నంత సజావుగా సాగుతున్నట్టుగా కనిపించడం లేదని తెలుస్తోంది. తాజా బంద్ ప్రకారం కొన్ని సినిమాలు షూటింగ్ లు నిలిచిపోగా మరి కొన్ని చిత్రాలకు సంబంధించిన షూటింగ్ లు మాత్రం యధావిధిగానే జరుగుతున్నాయి.
దీంతో ఇండస్ట్రీలో గందలగోళం నెలకొంది. బంద్ కు ముందు నుంచి యాక్టీవ్ గా వ్యవహరించిన గిల్డ్ ప్రొడ్యూసర్లకు సంబంధించిన చిత్రాలే అత్యధికంగా సెట్స్ పై వుండటం... యధావిధిగా షూటింగ్ లు జరుపుకుంటుండటంతో మిగతా నిర్మాతలు తీవ్ర అభ్యంతరాలని వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తగా ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన బసిరెడ్డి మాత్రం తెలుగు సినిమా షూటింగ్ లు మాత్రమే నిలిపివేయాలని నిర్ణయించామని, ఇతర భాష సినిమాలు షూటింగ్ ల గురించి బంద్ ప్రకటించలేదని స్పష్టం చేశారు.
ఇండస్ట్రీలో తీవ్ర గందలగోళం నెలకొనడానికి కారణం దిల్ రాజు అని అంటున్నారు. ఆయన తమిళ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళంలో `వారీసు`గా, తెలుగులో `వారసుడు`గా ఓ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ యధావిధిగా వైజాగ్ లో జరుగుతోంది. ఇదే ఇప్పడు నిర్మాతలలో తీవ్ర గందరగోళానికి తెర తీసింది. అయితే ఇది తమిళ సినిమా అని, తెలుగు సినిమా కాదని, అందుకే షూటింగ్ చేస్తున్నామని దిల్ రాజు వివరణ ఇచ్చారు. కానీ మిగతా నిర్మాతలు మాత్రం ఆ వివరణతో సంతృప్తి చెందలేదని తెలుస్తోంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలతో పాటు మరి కొంత మంది స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాల షూటింగ్ లు మాత్రం యధా విధిగానే జరుగుతుండటం గమనార్హం. ఇదే ఇప్పడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఏది ఆపాలి.. ఏది ఆపకూడదు.. అనే విషయంలో నిర్మాతలు కూడా తర్జనభర్జన పడుతున్నారట. ఇదిలా వుంటే మంగళవారం నిర్మాతల బమండలి ఆధ్వర్యంలో కార్మికుల వేతనాలకు సంబంధించి నిర్మాతలకు, ఆయా యూనియన్లకు మధ్య చర్చలు జరగనున్నాయి.