Begin typing your search above and press return to search.

రాజుగారికి ఆ మాత్రం తెలియ‌కుండానే దిగిపోతారా?

By:  Tupaki Desk   |   22 April 2022 1:30 AM GMT
రాజుగారికి ఆ మాత్రం తెలియ‌కుండానే దిగిపోతారా?
X
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు స‌క్సెస్ ఫుల్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. డిస్ర్టిబ్యూట‌ర్ గా ప్రారంభ‌మై నిర్మాత‌గా ఎదిగారు. నేడు అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రుగా కొన‌సాగుతున్నారు. సినిమాని జ‌డ్జ్ చేయ‌డంలో ఆయ‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఉంది. త‌న‌లో ఆ క్వాలిటీనే రాజుగార్ని అంత‌వ‌ర‌కూ తీసికొచ్చింది. నేడు దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తోనే సినిమా నిర్మించే స్థాయికి చేరుకున్నారు. సినిమాలు హిట్ అవ్వ‌డం..ఫ‌ట్అవ్వ‌డం స‌హ‌జం. ఇది ఏ నిర్మాత‌కైనా త‌ప్ప‌ని స‌రి.

కానీ రాజు గారి కెరీర్ గ్రాప్ మొత్తం ప‌రిశీలిస్తే ఆయ‌న‌కు హిట్లు ఎక్కువ‌గా ఉన్నాయి అన్న‌ది వాస్త‌వం. కొంత వ‌ర‌కూ రాజుగారిపై ల‌క్ ప్యాక్ట‌ర్ క‌లిసొస్తుంది. అయితే ఇటీవ‌లే రాజుగారు కోలీవుడ్ హీరో విజ‌య్ న‌టించిన 'బీస్ట్' చిత్రాన్ని తెలుగు లోరిలీజ్ చేసారు. అంత‌కు ముందే రాజుగారే ఇదే హీరోతె తెలుగు...త‌మిళ్ లో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా నిర్మించ‌డానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అలా కుదిరిన స్నేహం 'బీస్ట్' రిలీజ్ వ‌ర‌కూ దారి తీసింది.

కానీ ఇటీవ‌ల రిలీజ్ అయిన 'బీస్ట్' బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన‌ సినిమా ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని ఎదుర్కుంది. తెలుగు నాట అంచ‌నాలు అందుకోవ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంది. సొంత రాష్ర్టంలోనూ 'బీస్ట్' అదే ప‌రిస్థితిలో ఉంది. ఆ ర‌కంగా రాజుగారికి విజ‌య్ ద్వారా కొంత న‌ష్టం ముందుగానే వ‌చ్చింది. దీంతో రాజుగారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు ప‌రిగెడుతున్నాయి అన్న వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

విజ‌య్ తో సినిమా నిర్మించ‌డం తో రాజు గారు రిస్క్ తీసుకుంటున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. విజ‌య్ త‌మిళ్ హీరో..పైగా తెలుగులో అంత మార్కెట్ కూడా లేదు. త‌మిళ్లో దిల్ రాజు సినిమాని ఎవ‌రు పంపిణీ చేస్తారు? బ‌య్య‌ర్లు ఎలా దొరుకుతారు? అంత‌గా అక్క‌డ ఆయ‌న‌కు పరిచ‌యాలు ఏమి ఉన్నాయి? ఈ రెండు కార‌ణ‌లు మించి ఓ తెలుగు నిర్మాత‌ని మ‌ద్రాసు వాళ్లు ఎందుకు ప్రోత్స‌హిస్తారు? అన్న కార‌ణం తెర‌పైకి వ‌స్తుంది.

ఆర‌కంగా బిజినెస్ ప‌రంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. పైగా ఈ సినిమాని త‌మిళ్ లో తీసి తెలుగులో డ‌బ్ చేస్తార‌ని మ‌రోవైపు ప్ర‌చారం సాగుతోంది. ఇలా కొన్ని విష‌యాల్నిరాజు గారు బేరీజు వేసుకుంటే కొంత టెన్ష‌న్ త‌ప్ప‌ద‌నే కామెంట్ వినిపిస్తుంది.

అయినా ఇవ‌న్నీ రాజుగారు ఇప్ప‌టివ‌ర‌కూ ఆలోచ‌న చేయ‌కుండా ఉంటారా? ఆ మాత్రం స‌ర్కిల్ లో లేకుండా కోలీవుడ్ మూవీ కి రెడీ అవుతారా? అన్న‌ది మ‌రికొంత మంది అభిప్రాయం. శంక‌ర్ సినిమా నిర్మాత‌గా మార‌డంతోనే రాజుగారు పాన్ ఇండియాలో ఫేమస్ అయిపోయార‌ని ఆయ‌న ఫాలోవ‌ర్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.