Begin typing your search above and press return to search.

'ఉయ్యాల‌వాడ‌'లో విల‌క్ష‌ణ న‌టుడు?

By:  Tupaki Desk   |   13 July 2017 1:52 PM GMT
ఉయ్యాల‌వాడ‌లో విల‌క్ష‌ణ న‌టుడు?
X
త‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర. ఉపేంద్ర‌, రా వంటి వైవిధ్యమైన చిత్రాల‌తో కుర్ర‌కారును ఆక‌ట్టుకున్న ఉపేంద్ర త‌ర్వాతి కాలంలో తెలుగులో కొన్ని కీల‌క‌మైన పాత్ర‌లు పోషించాడు. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో ఉపేంద్ర ఓ కీల‌క‌మైన పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.

త్వ‌ర‌లో మ‌రోసారి ఆయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించేందుకు సిద్ధ‌మ‌య్యాడని స‌మాచారం. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ లో ఓ కీల‌క‌మైన పాత్ర పోషించేందుకు ఉపేంద్ర‌ను సంప్ర‌దించార‌ట‌. అయితే, ఉపేంద్ర దీనికి ఒప్పుకున్నారో? లేదో? అనే విష‌యాన్ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌లేదు. 2015లో అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో వచ్చిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ విజ‌యంలో ఉపేంద్ర కీ రోల్ ప్లే చేసిన విష‌యం తెలిసిందే.

ఖైదీ నంబర్‌ 150 తర్వాత చిరు నటిస్తున్న ‘ఉయ్యాలవాడ’లో హీరోయిన్ల కోసం బాలీవుడ్ లో ప‌లువురిని సంప్ర‌దించిన సంగ‌తి తెలిసిందే. అయితే, చివ‌ర‌కు చిరుకు జోడీగా నయనతార నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఆగస్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా దీనికి కొబ్బరికాయ కొట్టే అవకాశం ఉంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.