Begin typing your search above and press return to search.
ఉపేంద్ర సినిమాలు స్నేహితులకు యాక్
By: Tupaki Desk | 14 Aug 2015 1:44 AM GMTఇండియన్ సినిమాలందు ఉపేంద్ర సినిమాలు వేరయా అని చెప్పుకోవాలి. అతడి దర్శకత్వంలో వచ్చే సినిమాల కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎ, రా, ఉపేంద్ర, సూపర్ లాంటి సినిమాలతో అటు కన్నడలో, ఇటు తెలుగులో భారీగా అభిమానగణాన్ని సంపాదించుకున్నాడు ఉపేంద్ర. దశాబ్దంన్నర కిందట తీసిన ‘ఉపేంద్ర’కు సీక్వెల్ గా ఉపేంద్ర-2తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ఉప్పి. ఐతే ఉపేంద్ర సినిమాలంటే పడి చచ్చే అభిమానులు బయట చాలామంది ఉన్నారు కానీ.. ఉప్పి కుటుంబ సభ్యులు, స్నేహితులకు మాత్రం అతడి సినిమాలు అస్సలు నచ్చవట. ఆ సంగతి ఉపేంద్రే స్వయంగా వెల్లడించాడు.
‘‘మా ఫ్యామిలీ మెంబర్స్ కి నా సినిమా అస్సలు నచ్చవు. నా స్నేహితులు కూడా అంతే. నా సినిమాలు వాళ్లకు చూపించినపుడు.. ‘ఇలాంటి సినిమా తీశావేంట్రా బాబూ’ అని తలలు పట్టుకుంటుంటారు. ‘ఎ’ సినిమా చూసినపుడు నా ఫ్రెండ్సందరూ తిట్టారు. కానీ విడుదలయ్యాక ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అందుకే మా వాళ్ల అభిప్రాయాలు పట్టించుకోను’’ అని ఉపేంద్ర చెప్పాడు. తనలోని నటుడి కంటే దర్శకుడినే ఎక్కువ ఇష్టపడతానని చెప్పిన ఉపేంద్ర.. ఐతే దర్శకుడిగా తనమీద ప్రేక్షకులకు అంచనాలు ఉంటాయి కాబట్టే తరచుగా సినిమాలు తీయనని.. విభిన్నమైన ఆలోచనలు వచ్చినపుడే సినిమా చేస్తానని చెప్పాడు. తెరమీద తాను కనిపించే విధానాన్ని బట్టి జనాలకు బయట కూడా తాను అలాగే ఉంటానన్న అభిప్రాయం ఉందని.. కానీ తాను నిజ జీవితంలో చాలా కూల్ గా, ఒంటరిగా ఉంటుంటానని.. నిత్యం తనను తాను వెదుక్కొనే క్రమంలో ఉంటానని.. అందులో భాగంగా వచ్చిన ఆలోచనల్నే సినిమాలుగా మలుస్తానని ఉప్పి చెప్పాడు.