Begin typing your search above and press return to search.
అమీర్ కు ఉపేంద్ర పంచ్
By: Tupaki Desk | 26 Nov 2015 2:46 PM GMTఅమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మంట పుట్టిస్తూనే ఉన్నాయి. దేశంలో అసహనం పెరిగిందని.. తన భార్య దేశం విడిచి వెళ్లిపోవాలన్న మాటను బహిరంగంగా చెప్పి పెను వివాదంలో చిక్కుకున్న అమీర్ పై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ విరుచుకుపడుతున్నారు.
తాజాగా కన్నడ నటుడు ఉపేంద్ర అమీర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. అతని వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఆయన.. తాను అమీర్ అభిమానినని.. కానీ అతగాడి మాటలు తనను ఎంతగానో బాధించాయని చెప్పిన ఉపేంద్ర.. ఈ దేశం నుంచి పారిపోతే మిమ్మల్ని పిరికివాడని అంటారు.. ఈ విషయాన్ని చెప్పటానికి నేనెంతో విచారిస్తున్నా అని వ్యాఖ్యానించారు.
ఇకపై తన దృష్టిలో కానీ.. అమీర్ ను అభిమానించే అభిమానుల దృష్టిలో ఇక ఏమాత్రం హీరోవి కావని తేల్చేసిన అమీర్.. తన ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. అమీర్ మీద పంచ్ ల మీద పంచ్ లు ఇచ్చిన ఉపేంద్ర చివర్లో తనదైన శైలిలో ఖాన్ల అందరికి కలిపి భారీ పంచ్ ఇచ్చి ముగించాడు. అమీర్.. షారూక్ లు అసలేం వర్రీ కావొద్దని.. మీ తాజా సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయని చెప్పిన ఉపేంద్ర.. భారతీయులు తామెంత సహనశీలురన్న విషయాన్ని నిరూపిస్తారన్నారు. ఆ విషయం ఖాన్లకు కూడా తెలుసని ముక్తాయించారు. అమీర్ వ్యాఖ్యలు సామాన్యుల్నే కాదు.. సెలబ్రిటీలను కూడా విపరీతంగా బాధించినట్లు ఉపేంద్ర వ్యాఖ్యలు చూస్తే అర్థం కాక మానదు.