Begin typing your search above and press return to search.
అది నాది కాదు.. ఇదే నాది
By: Tupaki Desk | 5 Jan 2018 4:58 PM GMTసోషల్ మీడియా ప్రభావం ఈ రోజుల్లో జనాల్లో ఎంత ఉందొ తెలియదు గాని సెలబ్రెటీల్లో మాత్రం చాలానే ఉందని చెప్పాలి. సోషల్ మీడియాను ప్రస్తుతం అందరు ఫాలో అవుతుండడంతో పీఎం నుంచి గ్రామా సర్పంచ్ వరకు పబ్లిసిటి కోసం సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా హీరో నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు ఫేమస్ అవ్వడానికి ఫ్రీ పబ్లిసిటి చేసుకుంటున్నారు. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా ఇష్టం వాచినట్టు ఎవరికీ వారు ఏదేదో కామెంట్స్ కుడా చేస్తున్నారు.
చాలా వరకు పబ్లిసిటి కోసమే సోషల్ మీడియా అకౌంట్స్ ని తెగ వాడేస్తున్నారు. ఇకపోతే అప్పుడపుడు వాటి వల్ల ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. కొంతమంది ఫెక్ అకౌంట్స్ క్రియేట్ చేసి చాలా మోసాలకు పాల్పడుతున్నారు. అంతే కాకుండా హ్యాకింగ్ సమస్యలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఇక అసలు విషయానికి వస్తే.. ఇటీవల కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కు ఫేక్ ఎకౌంట్ వల్ల ఒక చేదు అనుభవం ఎదురైంది. అక్కడి స్థానిక న్యూస్ పేపర్ విశ్వవని లో ఉపేంద్ర ఒక ట్వీట్ చేసినట్లు పేపర్ లో వేశారు.
అయితే ట్విట్టర్ ఎకౌంట్ ఐడి తప్పుగా వేయడంతో వెంటనే ఉపేంద్ర అందుకు సంబందించిన ఫొటోని పోస్ట్ చేసి వివరణ ఇచ్చాడు. అది నా ట్విట్టర్ ఎకౌంట్ కాదని ఇదే అసలైందని ట్వీట్ చేశాడు. ఈ తరహా మిస్టేక్స్ మీడియాలో జరుగుతుండడం కామన్. ఇంతకుముందు ఓ ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో ఒకరు చనిపోతే మరొకరి ఫోటో వేశారు. ఆ విషయాన్ని అమితాబ్ ట్వీట్ చేశాడు కూడా. అది సంగతి.