Begin typing your search above and press return to search.

పెళ్లాం స్రిప్టు.. మొగుడు డైలాగ్స్‌..

By:  Tupaki Desk   |   14 July 2015 11:18 AM GMT
పెళ్లాం స్రిప్టు.. మొగుడు డైలాగ్స్‌..
X
ఇంగ్లీష్‌ వింగ్లీష్‌తో శ్రీదేవి, 36 వయదినిలే చిత్రంతో జ్యోతిక సరికొత్త రివల్యూషన్‌ తీసుకొచ్చారు. మహిళా ప్రధాన కథలతో కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టొచ్చు అని నిరూపించారు. హీరో కేంద్రకంగానే సినిమాలు తీయాల్సిన పనే లేదని ఈ చిత్రాలు నిరూపించాయి. అంతేనా విద్యాబాలన్‌ 'డర్టీ పిక్చర్‌'తో అంతకుముందు ఉన్న సందేహాలన్నిటినీ పటాపంచలు చేసింది.

పెళ్లి కాని ఓ యువతి, సహజీవనంలో ఉన్న పడతి ఈ రేంజులో ఎక్స్‌పోజ్‌ చేస్తే జనాలు ఇరగబడి చూసేస్తారు అనడానికి అదో ఉదాహరణ. కంటెంట్‌ బావుండాలే గానీ నటించే పడతికి పెళ్లయ్యిందా? గృహిణి అయ్యిందా? ఇల్లాలైందా? ఇవేవీ చూడరు. అందుకు తాజా ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కథే ముఖ్యం. కంటెంట్‌, నట ప్రదర్శన చాలా ముఖ్యం. అవే నడిపిస్తున్నాయి.

అందుకే ఇప్పుడు ప్రముఖ స్టార్‌ హీరో ఉపేంద్ర భార్య ప్రియాంక లేడీ ఓరియెంటెడ్‌ సినిమా తీయడానికి రెడీ అవుతోంది. తనే కథారచయిత. మెయిన్‌ లీడ్‌లోనూ నటించే ఛాన్సుంది. అయితే ఈ చిత్రానికి భర్తగారే డైలాగ్స్‌ రాసేది. అమ్మడు అప్పట్లో కొన్ని కన్నడ సినిమాల్లో తన గ్లామర్‌తో దంచేసింది. ఆ తరువాత ఉప్పీని పెళ్ళిచేసుకుని సెండాఫ్‌ ఇచ్చి మొన్ననే ఓ సినిమాతో నటిగా రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఐప్యాడ్‌పై కథలు కూడా చెక్కుతోందట.