Begin typing your search above and press return to search.
సేతుపతి డబ్బింగ్ వెనుక అసలు కథ చెప్పిన 'ఉప్పెన' డైరెక్టర్..!
By: Tupaki Desk | 10 Feb 2021 1:30 PM GMTమెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న 'ఉప్పెన' సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ట్రైలర్ ద్వారా ఆయన పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయో శాంపిల్ గా చూపించారు. అయితే గంభీరంగా కనిపించిన విజయ్ సేతుపతికి చెప్పించిన డబ్బింగ్ పై అందరూ పెదవి విరిచారు. సేతుపతికి డబ్బింగ్ ఏ మాత్రం సూట్ కాలేదని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సన దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
బుచ్చిబాబు మాట్లాడుతూ.. 'విజయ్ సేతుపతి ఈ కథ విన్న వెంటనే ఈ పాత్రకు నా వాయిస్ సెట్ కాదు అని అన్నాడు. అందుకే వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించాలని ఎంతో మందిని ట్రై చేశాం. చివరకు బొమ్మాళి రవిశంకర్ తో డబ్బింగ్ చెప్పించాం. ఇండియాలో డబ్బింగ్ ఆర్టిస్ట్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేది ఆయనే. అలాంటి ఆయనతోనే సేతుపతి పాత్రకు డబ్బింగ్ చెప్పించామ'ని తెలిపాడు.
'రవి శంకర్ మామూలుగా అయితే అలా వచ్చి ఇలా డబ్బింగ్ చెప్పి వెళ్లిపోతాడు. ఒక్క రోజులోనే ఎలాంటి పాత్ర అయినా సినిమా అయినా డబ్బింగ్ చెప్పేసి వెళ్లిపోతారట. ఉప్పెన సినిమాకి కూడా ఒక్క రోజులోనే డబ్బింగ్ చెప్పేసి వెళ్లిపోదామని వచ్చిన రవిశంకర్.. సినిమా చూసి ఇదేంటి ఇలా ఉందని మూడు రోజులు ఉండి మరీ డబ్బింగ్ పూర్తి చేశారు. ఉప్పెనలో విజయ్ సేతుపతి కచ్చితంగా భయపెడతాడు.. వాయిస్ మరింత భయపెడుతుంది' అని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. మరి సినిమాలో విజయ్ సేతుపతి డబ్బింగ్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.