Begin typing your search above and press return to search.
ఉప్పెన : సోషల్ మీడియా కాలంలో దాచడం సాధ్యమా?
By: Tupaki Desk | 24 Jan 2020 5:17 AM GMTమెగా బ్రదర్స్ చిన్న మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. మామూలుగా ఫస్ట్ లుక్ అంటే సినిమాలో హీరో ఎలా ఉండబోతున్నాడు అనే విషయాన్ని క్లీయర్ గా చూపించేది. కాని ఉప్పెన ఫస్ట్ లుక్ లో మాత్రం వైష్ణవ్ తేజ్ ఎలా ఉండబోతున్నాడు అనేది క్లారిటీగా చూపించలేదు. గతంలో కూడా ఒక పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ సభ్యులు వైష్ణవ్ తేజ్ ఫేస్ ను పూర్తిగా చూపించలేదు.
గతంలో రామ్ చరణ్ చిరుత మూవీకి కూడా ఇలాగే చేశారు. సినిమా విడుదల అయ్యే వరకు రామ్ చరణ్ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో క్లారిటీ ఇవ్వలేదు. ప్రేక్షకులు చరణ్ ను పూర్తి స్థాయిలో క్లారిటీగా సినిమాలోనే చూడటం జరిగింది. ఇప్పుడు అదే తరహా ట్రిక్ ను ఉప్పెన చిత్ర యూనిట్ సభ్యులు ఫాలో అవుతున్నట్లు గా ఈ రెండు పోస్టర్స్ ను చూస్తుంటే అనిపిస్తుంది. కాని ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే గతంలో సోషల్ మీడియా ఎక్కువగా లేదు కనుక రామ్ చరణ్ లుక్ ప్రేక్షకులకు ఎక్కువగా తెలియదు. సినిమాలో పూర్తిగా చూడటంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యారు. కాని సోషల్ మీడియాలో వైష్ణవ్ తేజ్ ను ఇప్పటికే ప్రేక్షకులు చూడటంతో పాటు కొన్ని ఉప్పెన లీక్ ఫొటోల్లో కూడా వైష్ణవ్ ను చూడటం జరిగింది. సోషల్ మీడియాలో వైష్ణవ్ తేజ్ ఫొటోలు వందలకొద్ది ఉంటాయి. సోషల్ మీడియా ఇంతగా ఉన్న సమయంలో ఫేస్ ను చూపించకుండా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాలని తెలివితక్కువతనం అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
వైష్ణవ్ తేజ్ ఫేస్ హైడ్ చేసినంత మాత్రాన ఆయన్ను చూడాలనే క్యూరియాసిటీ ఎవరిలో లేదని.. ఇప్పటికే అందరు ఆయన్ను చూసేశారు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. హాయిగా ఫేస్ చూపిస్తూనే ప్రమోట్ చేయాలని.. కాకుంటే మరేదైనా కొత్త పద్దతి లో వైష్ణవ్ ను ప్రమోట్ చేస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకత్వం లో మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.