Begin typing your search above and press return to search.

ఓటీటీలో 'ఉప్పెన'.. ఎప్పటి నుంచి అంటే..?

By:  Tupaki Desk   |   13 Feb 2021 9:30 AM GMT
ఓటీటీలో ఉప్పెన.. ఎప్పటి నుంచి అంటే..?
X
మెగా కాంపౌండ్ నుంచి వెండి తెర‌పై హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణ‌వ్ తేజ్ ఫ‌స్ట్ మూవీ 'ఉప్పెన'. ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు అందుకుంటోంది. క్లైమాక్స్ పై మిక్స్‌డ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ.. నటీనటుల పెర్ ఫార్మెన్స్ గురించి మాత్రం యునానిమస్ గా క్లాప్స్ కొడుతున్నారు.

తొలి సినిమాతోనే వైష్ణవ్ తన రేంజ్ ను చాటుకున్నాడని చెబుతున్న ఆడియన్స్.. హీరోయిన్ కృతి చాలా అందంగా అభిన‌యించింద‌ని కితాబిస్తున్నారు. మొత్తానికి అన్ని వైపుల నుంచీ వ‌స్తున్న ఈ పాజిటివ్ బ‌జ్ తో.. మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తోందీ చిత్రం. ఓపెనింగ్స్‌ విష‌యంలో బిగ్గెస్ట్ డెబ్యూ మూవీగా నిలుస్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

కాగా.. ఈ సినిమా డిజిట‌ల్‌ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా థియేట్రిక‌ల్ రిలీజ్ కు ముందుగానే ఈ అగ్రిమెంట్ జ‌రిగింది. ఆ ఒప్పందం ప్ర‌కారం.. థియేటర్లో విడుదలైన‌ 60 రోజుల తర్వాతే ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయాల్సి ఉంది.

ఆ లెక్క‌న‌ అందుతున్న అప్డేట్ ప్ర‌కారం.. ఈ చిత్రం ఏప్రిల్ 11 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు.