Begin typing your search above and press return to search.

'ఉప్పెన' నాలుగో సినిమా.. ఆ అమ్మాయిపై క్ర‌ష్ ఉందిః వైష్ణ‌వ్ తేజ్

By:  Tupaki Desk   |   16 Feb 2021 1:30 AM GMT
ఉప్పెన నాలుగో సినిమా.. ఆ అమ్మాయిపై క్ర‌ష్ ఉందిః వైష్ణ‌వ్ తేజ్
X
ఇప్పుడు టాలీవుడ్లో ఫుల్ డిస్క‌ష‌న్స్ లో ఉన్న సినిమా 'ఉప్పెన‌'. ఫుల్ ప్రమోషన్స్ నడుమ.. భారీ హైప్ తో థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ.. అంతకు మించి అంటూ.. ఎక్స్ పెక్టేషన్స్ ను క్రాస్ చేస్తూ దూసుకెళ్తోంది. ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన డెబ్యూ మూవీగా నిలవబోతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరో వైష్ణవ్ తేజ్.. తన లైఫ్ కు సంబంధించిన మరిన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు.

వైష్ణవ్.. పవన్ కల్యాణ్ మాదిరిగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం విచిత్రం. పవర్ స్టార్ ను మొదట్లో డైరెక్షన్ విభాగం వెళ్లమన్నాడట చిరు. కానీ.. యాక్టింగ్ పై ఇంట్రస్ట్ ఉండడంతో తాను హీరోగా వచ్చానని గతంలో చెప్పారు పవన్. ఇప్పుడు వైష్ణవ్ కూడా అంతే. దర్శకుడిగా మారుదామనుకుని, హీరో అయ్యాడట. మూడు పదుల వయసున్న వైష్ణవ్.. ఇంత ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఇదేనట.

''నాకు చిన్నతనం నుంచే యాక్టింగ్ పై పెద్దగా ఇంట్రస్ట్ లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో మాత్రం పెద్ద మామయ్య వీల్ చైర్ లో కదలకుండా కూర్చోవాలి అని చెప్పారు. అలాగే చేశాను. ఆ తర్వాత జానీ, అందరివాడు సినిమాల్లో కూడా నటించాను.'' అని చెప్పాడు వైష్ణవ్.

అంతేకాదు.. లైఫ్ పై క్లారిటీ లేక మదనపడిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నాడు వైష్ణవ్. ''సైంటిస్ట్ అవుదామనుకున్నా. వ్యోమగామిగా మారిపోవాలనుకున్నా. ఆర్మీలో చేరి దేశరక్షణలో భాగం కావాలనుకున్నాను. తర్వాత సినిమా డైరెక్టర్ కావాలని చూశాను'' అంటున్నాడు వైష్ణవ్. అయితే.. డైరెక్షన్ జాబ్ ఈజ్ నాట్ ఈజీ.. అని వదిలేశాడట. ఫైనల్ గా ఓ ప్రయత్నం చేయమన్న చిరు మాటలతో మేకప్ వేసుకున్నాడు వైష్ణవ్.

తన టీనేజ్ లైఫ్ గురించి చెప్పిన వైష్ణవ్.. లవ్ సీక్రెట్స్ గుట్టు కూడా విప్పాడు. అయితే.. తాను మాత్రం ఎవ్వరినీ లవ్ చేయలేదన్న వరుణ్.. ఓ అమ్మాయిపై క్రష్ ఉండేదన్నాడు. డిగ్రీలో ఒక సీనియర్ అమ్మాయిపై క్రష్ పెంచుకున్న వైష్ణవ్.. ఆమె కోసం కాలేజీ అయిపోయే వరకూ వెయిట్ చేసేవాడట. అయితే.. చూపులకే పరిమితం అయ్యానన్న వైష్ణవ్ తేజ్.. మాట్లాడేందుకు మాత్రం ధైర్యం చాల్లేదని చెప్పుకొచ్చాడు. అదే సందర్భంలో ముగ్గురు అమ్మాయిలు తనకు ప్రపోజ్ చేశారని కూడా చెప్పాడు.