Begin typing your search above and press return to search.
నెట్టింట ఉప్పెన సృష్టిస్తున్న 'జలపాతం' మేకింగ్ వీడియో..!
By: Tupaki Desk | 6 April 2021 8:30 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది ఉప్పెన సినిమా విడుదలై ఎలాంటి భారీ విజయం అందుకుందో అందరికి తెలిసిందే. ఉప్పెన సినిమాతో మెగాహీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఇండస్ట్రీలో తొలిఅడుగు వేస్తూనే ఈ ముగ్గురు అద్భుతమైన హిట్ నమోదుచేశారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా పెట్టిన బడ్జెట్ కు భారీ లాభాలే రిటర్న్ ఇచ్చింది. అయితే ఈ సినిమా విజయానికి ముఖ్యకారణం సంగీతం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాను సంగీతంతో మరో ఎత్తులో నిలబెట్టాడు. ఈ సినిమాకు జనాలు కుప్పలుగా థియేటర్లకు తరలివచ్చి సినిమా చూడటానికి మరో కారణం కృతిశెట్టి.
ముఖ్యంగా ఈ సినిమాలో 'నీ కన్ను నీలి సముద్రం' పాట అందరిని సినిమా వైపు లాగితే సినిమాను నిలబెట్టింది మాత్రం 'జలపాతం' సాంగ్. ఆ పాటలోనే సినిమా మేటర్ అంతా దాగి ఉందని సినిమా చూసేవరకు ఎవరికీ తెలియదు. అయితే ఎంతో వినసొంపుగా ఉండే జలపాతం పాట సినిమాలో చూస్తే సముద్రంలో సాగుతుంది. అలాగే ఈ పాటలో వైష్ణవ్, కృతిల మధ్యలో సాఫ్ట్ రొమాన్స్ కూడా ఉంటుంది. నిజానికి ఈ పాటను అందరూ సముద్రంలోనే పడవలో షూట్ చేసారని అనుకున్నారు. కానీ తాజాగా మేకర్స్ జలపాతం సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఖచ్చితంగా ఆ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే జలపాతం పాటను షూట్ చేసింది ఓ స్విమ్మింగ్ పూల్ లో. అవునా అని అందరికి అనిపించవచ్చు. కానీ ఎంతో చక్కగా ఎలాంటి వల్గారిటీ లేకుండా సాంగ్ కంపోజ్ చేశారు. ఖచ్చితంగా ఈ విషయంలో పెర్ఫార్మన్స్ పరంగా హీరో హీరోయిన్లను, కొరియోగ్రఫీ పరంగా బృందా గారికి అభినందనలు తెలపాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో 40 మిలియన్స్ వైపు పరుగులు పెడుతోంది.