Begin typing your search above and press return to search.

హీరో నుంచి ద‌ర్శ‌కుడిగా మారిన వైష్ణ‌వ్ తేజ్‌!

By:  Tupaki Desk   |   15 April 2021 7:57 AM GMT
హీరో నుంచి ద‌ర్శ‌కుడిగా మారిన వైష్ణ‌వ్ తేజ్‌!
X
‘‘నా డ్రీమ్ యాంబిష‌న్స్ లో డైరెక్ష‌న్ కూడా ఉంది. అసలు ముందుగా డైరెక్టర్ అవుదామనే అనుకున్నాను. కానీ.. తర్వాత హీరోగా మారాను’’ అని ‘ఉప్పెన’ ప్రమోషన్స్ లో ప్ర‌క‌టించాడు మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్‌. అన్నట్టుగానే.. డైరెక్టర్ గా మారాడు. అయితే.. ఇదేదో కొత్త సినిమాకు సంబంధించి కాదు. ‘ఉప్పెన’ సినిమానే డైరెక్ట్ చేశాడు వైష్ణవ్!

అస‌లు విష‌యం ఏమంటే.. కొన్ని రోజులుగా ఉప్పెన‌ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోల‌ను రిలీజ్ చేస్తున్నారు బుచ్చిబాబు. తాజాగా మ‌రో మేకింగ్ వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇందులో విజ‌య్ సేతుప‌తి, కృతిశెట్టి యాక్టింగ్ కు సంబంధించిన విజువ‌ల్స్ ఉన్నాయి.

అయితే.. కొన్ని సీన్ల‌కు డైరెక్ష‌న్ చేశాడు వైష్ణ‌వ్‌. మెగాఫోన్ చేత‌బ‌ట్టి యాక్ష‌న్‌, క‌ట్ అంటూ సంద‌డి చేశాడీ మెగాహీరో. ఇప్పుడు ఈ వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. మొత్తానికి డైరెక్ట‌ర్ అవ్వాల‌న్న కోరిక‌ను మొద‌టి సినిమా ద్వారానే ఇలా తీర్చేసుకున్నాడ‌ని అంటున్నారు.

కాగా.. ‘ఉప్పెన’ చిత్రం భారీ సక్సెస్ సాధించడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు. విమ‌ర్శ‌కుల ప్రశంస‌లు కూడా అందుకున్న ఈ చిత్రం.. భారీ వ‌సూళ్లు సాధించింది. ఈ సినిమా వంద‌కోట్లు సాధించింద‌ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్.