Begin typing your search above and press return to search.
'ఓటిటి'లోకొచ్చిన వందకోట్ల సినిమా!
By: Tupaki Desk | 14 April 2021 10:30 AM GMTఈ ఏడాది సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి ఉప్పెన. డెబ్యూ టీమ్ అయినప్పటికీ సినిమాను జనాలు బాగా ఆదరించారు. అదేవిధంగా కలెక్షన్స్ పరంగా కూడా ఉప్పెన సంచలనం సృష్టించింది. కానీ జనాలు మనసుకు నచ్చిన సినిమాలు థియేటర్లలో చూసాక ఆ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటిలో వస్తుందా.. ఎప్పుడెప్పుడు టీవీలో ప్రసారం అవుతుందా అని వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు అలా ఉప్పెన గురించి వెయిట్ చేసేవాళ్ళు ఇకపై వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉగాది కానుకగా సినిమాను ఆల్రెడీ ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఉప్పెన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. సినిమా థియేట్రికల్ రిలీజ్ అయ్యాక రెండు నెలలకు డిజిటల్ అయింది.
అలాగే త్వరలోనే టీవీ ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతుంది. ఉప్పెన మూవీ ఈ ఆదివారం స్టార్ మా ఛానల్లో ప్రసారం కాబోతుంది. థియేటర్లో చూడటం మిస్ అయిన వారంతా ఇప్పుడు ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాను టీవీలో ఎంజాయ్ చేయవచ్చు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 100కోట్ల వరకు వసూల్ చేసిందని సమాచారం. మరి ఒక డెబ్యూ టీమ్ ఆ రేంజిలో కలెక్షన్స్ రాబట్టడం అంటే మాములు విషయం కాదు. ఈ సినిమాతో మెగాహీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టిలు పరిచయమయ్యారు. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాతో విలన్ గా పవర్ ఫుల్ ఎంట్రీ ఇవ్వగా.. డైరెక్టర్ బుచ్చిబాబు సాన నూతన దర్శకుడుగా అడుగుపెట్టాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు.