Begin typing your search above and press return to search.
‘ఉప్పెన’కు ఆర్యతో లింక్ పెట్టారుగా..!
By: Tupaki Desk | 22 March 2020 11:30 PM GMTకరోనా కారణంగా పలు చిత్రాలు విడుదల వాయిదా పడుతున్నాయి. ఉగాది కానుకగా విడుదల కావాల్సిన చిత్రాలని ఇప్పటికే వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారం రెండవ వారం విడుదల కావాల్సిన సినిమాలను కూడా వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 2న మెగా హీరో వైష్ణవ్ తేజ్ పరిచయం కాబోతున్న ఉప్పెన చిత్రం విడుదల కావాల్సి ఉంది. కాని థియేటర్ల బంద్ ఇంకా కరోనా కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
సినిమాను మే నెలలో విడుదల చేయాలని నిర్ణయించారు. మే లో 7వ తారీకున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చి బాబు ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు అనే విషయం తెల్సిందే. సుకుమార్ మొదటి చిత్రం ఆర్య మే 7వ తారీకున విడుదల అయ్యింది. అందుకే గురువుగారి మొదటి సినిమా తేదీని శిష్యుడు బుచ్చి బాబు ఎంపిక చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
మే 7వ తారీకు శుక్రవారం కాకున్నా కూడా కేవలం ఆర్యతో లింక్ ఉండాలనే ఉద్దేశ్యంతో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే గురువారం అయినా కూడా మే 7న విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకు నిర్మాతలు మైత్రి మూవీస్ వారు ఇంకా సుకుమార్ కూడా ఒప్పుకున్నారట. అయితే కరోనా వైరస్ ప్రభావం అప్పటి వరకు పూర్తిగా తగ్గితేనే సినిమాల విడుదల ఉండే అవకాశం ఉంది.
ఇంకా నెల రోజులకు ఎక్కువ సమయం ఉంది కనుక ఖచ్చితంగా అప్పటి వరకు కరోనా ప్రభావం తగ్గుతుందని అంతా విశ్వసిస్తున్నారు. అందుకే కొత్త విడుదల తేదీను నిర్ణయిస్తున్నారు. ఏప్రిల్ 1 నుండి కాకున్నా ఏప్రిల్ రెండవ లేదా మూడవ వారంలో అయినా థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు.