Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: ఆ నలుగురికి కరోనా చెంప దెబ్బ
By: Tupaki Desk | 23 March 2020 2:30 AM GMTపరిశ్రమను శాసించేది ఆ నలుగురే అంటూ ఓ కామెంట్ రెగ్యులర్ గా వినిపిస్తుంటుంది. థియేటర్లను గుప్పిట పట్టి టాలీవుడ్ ని శాసిస్తున్న ఆ నలుగురికి శాస్తి జరగాల్సిందేనని థియేటర్లు దొరకని ప్రతి నిర్మాతా వేదికలపై విలపిస్తుంటారు. కరోనా దెబ్బకు తాత్కాలికంగా అలా విలపించాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఈ నెల 31 వరకూ థియేటర్లను బంద్ చేయడంతో ఆ మేరకు ఎగ్జిబిటర్ పై పెద్ద పంచ్ పడిపోయిందని విశ్లేషిస్తున్నారు. ఇక ఎగ్జిబిటర్ - డిస్ట్రిబ్యూటర్- నిర్మాత ఈ ముగ్గురిపైనా దీని ప్రభావం ఆషామాషీగా లేదు. సినీ ఇండస్ట్రీ పై దీని ప్రభావం అపారంగా ఉంటుందన్న విశ్లేషణ సాగుతోంది.
అదంతా అటుంచితే ఈనెల 25న రిలీజ్ కావాల్సిన నాలుగైదు సినిమాలు వాయిదా పడ్డాయి. అనుష్క - నిశ్శబ్ధం.. నానీ-సుధీర్ - వీ .. రానా - అరణ్య.. నాగచైతన్య - లవ్ స్టోరి లాంటి క్రేజీ చిత్రాలు కరోనా దెబ్బకు అర్థాంతరంగా నలిగిపోయాయన్న విశ్లేషణ సాగుతోంది. ఉప్పెన- నిశ్శబ్ధం - అరణ్య చిత్రాలు ఏప్రిల్ 2 కి పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక ఈ వాయిదాల వల్ల ఈ వరుసలో అరడజను పైగా సినిమాలు తీవ్రంగా చిక్కుల్ని ఎదుర్కోవాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. కరోనా కాస్త రిలీఫ్ ని ఇచ్చినా కానీ ఈ మహమ్మారీకి బాగా భయపడిపోయిన జనం థియేటర్లకు వస్తారా? అన్న సందిగ్ధత నెలకొంది. ఇక ఏపీ- తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో 6 .. తెలంగాణలో 22 కేసులు నమోదయ్యాయి.
ఇంకా బయటపడని కేసులు ఎన్నో ఎన్నెన్నో. కరోనా పాజిటివ్ ఉందని తెలిసీ బస్సులు.. రైళ్లలో పలువురు బాధ్యతారాహిత్యంగా ప్రయాణాలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాధి ఎందరికి సోకింది? అన్నదానిపై ఇప్పటికీ స్పష్ఠత లేదు. ఇలాంటి కల్లోలంలో అరడజను నుంచి డజను వరకూ సినిమాలన్నీ స్టాక్ అయ్యి ఒకేసారి రిలీజ్ చేయాల్సిన సన్నివేశం తలెత్తితే థియేటర్ల సమస్య ఉత్పన్నమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సన్నివేశాన్ని ఎదుర్కోవడం పెద్ద సమస్యే. తమ సినిమాకు థియేటర్లు ఇవ్వలేదన్న ఆవేదన చిన్న నిర్మాతల్లో మరోసారి స్పష్ఠంగా బయటపడేందుకు ఆస్కారం ఉంటుంది.
ఇక డి.సురేష్ బాబు (అరణ్య).. దిల్ రాజు సినిమా (ఒరేయ్ బుజ్జిగా చిత్రం)లు కూడా ఈ సీజన్ లో రిలీజ్ కి వస్తున్నాయి కాబట్టి ఆ మేరకు థియేటర్లు బ్లాక్ అయ్యే ఛాన్సుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇతర నిర్మాతలు థియేటర్ల షేరింగ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పనిసరి. అసలింతకీ ఏప్రిల్ నాటికి కరోనా నుంచి రిలీఫ్ దొరుకుతుందా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. అంటే అది సినిమా రిలీజ్ లకు డీప్ క్రైసిస్ కిందే లెక్క.