Begin typing your search above and press return to search.
ఉప్పెనకు OTT భారీ ఆఫర్.. కానీ ససేమిరా అన్నారట!
By: Tupaki Desk | 25 Aug 2020 5:30 PM GMTఒక డెబ్యూ హీరో సినిమాకి 10 కోట్లు పైబడిన బిజినెస్ అంటే పెద్ద ఆఫరే. మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అవుతున్న వైష్ణవ్ తేజ్ తొలి సినిమాకే ఏకంగా 13కోట్ల మేర ఓటీటీ ఆఫర్ వరించిందని సమాచారం. అయినా ఓటీటీ రిలీజ్ కి మేకర్స్ ససేమిరా అనేశారట. కారణం ఏమై ఉంటుంది? అంటే..
ఉప్పెనను ఎట్టిపరిస్థితిలో థియేట్రికల్ రిలీజ్ చేయాలనే పంతంతోనే మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఉన్నారట. ఇప్పటికే ఉప్పెన పాటలు పెద్ద సక్సెసయ్యాయి. కొత్త జంట పెర్ఫామెన్స్ అదరగొడుతోంది. ముఖ్యంగా కృతి శెట్టి అందచందాలకు కాలేజ్ కుర్రకారు ఫిదా అయిపోయారు. అందుకే ఈ సినమా 100 పర్సంట్ లవ్ రేంజులో పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట.
అయితే వాస్తవ పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. థియేట్రికల్ రిలీజ్ చేయాలంటే కచ్ఛితంగా వ్యాక్సిన్ లేదా టీకా రావాల్సి ఉంటుంది. ఇప్పట్లో అందుకు ఆస్కారం కనిపించడం లేదు. దీంతో సంక్రాంతి వరకూ వేచి చూడాలని నిర్మాతలు భావిస్తున్నారట. మరోవైపు 13 కోట్ల ఆఫర్ తో ఓటీటీ కంపెనీ వెంటపడుతోందని తెలిసింది. కానీ ఇది డెబ్యూ హీరో సినిమా అయినా మైత్రి సంస్థ ఏమాత్రం రాజీకి రాకుండా 22 కోట్ల మేర బడ్జెట్ ని ఖర్చు చేసింది. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు.
భారీ మొత్తాన్ని బాక్సాఫీస్ వద్ద వసూల్ చేయాల్సి ఉన్నందున మేకర్స్ కూడా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రేజీ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తమిళ టాప్ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన విలన్ గా నటించారు. సేతుపతికి పారితోషికం భారీగానే ముట్టజెప్పిన సంగతి తెలిసిందే.