Begin typing your search above and press return to search.

#ఉప్పెన .. నాలుగో రోజు ఎంత‌? 4 రోజుల్లో ఎంత‌?

By:  Tupaki Desk   |   16 Feb 2021 7:30 AM GMT
#ఉప్పెన .. నాలుగో రోజు ఎంత‌? 4 రోజుల్లో ఎంత‌?
X
మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ -కృతి శెట్టి జంట‌గా న‌టించిన ఉప్పెన సంచ‌ల‌న విజ‌యం సాధించి 50కోట్ల క్ల‌బ్ వైపు దూసుకెళుతోంది. మూడో రోజుకు 28కోట్ల షేర్ వ‌సూలు చేసిన ఈ చిత్రం నాలుగో రోజుకు 34కోట్ల షేర్ కు చేరువైంది. మునుప‌టి స్పీడ్ కొంత త‌గ్గినా భేషైన వసూళ్ల‌నే రాబ‌ట్టింది.

షేర్ వ‌సూళ్ల‌ను ప‌రిశీలిస్తే...నైజాం 9.88 కోట్లు.. వైజాగ్ 5 కోట్లు ..తూ.గో జిల్లా 2.84కోట్లు.. ప‌.గో జిల్లా 1.73 కోట్లు.. కృష్ణ 2.01 కోట్లు.. గుంటూరు 2.41 కోట్లు.. నెల్లూరు 1.01 కోట్లు.. సీడెడ్ 4.52 కోట్లు వ‌సూలు చేసింది. తెలంగాణ‌- ఎపి క‌లుపుకుని నాలుగు రోజుల్లో 29.57కోట్ల షేర్ వ‌సూలైంది. విదేశాల నుంచి 1.5 కోట్లు.. కర్ణాటక నుంచి 1.56 కోట్లు... తమిళనాడు నుంచి 58 ల‌క్ష‌లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా 43 లక్షలు వ‌సూలు చేసింది. ఉప్పెన టోట‌ల్ గా నాలుగు రోజుల‌కు 33.64 కోట్లు వ‌సూలు చేసింద‌ని మైత్రి నుంచి స‌మాచారం అందింది.

ఉప్పెన నాలుగో రోజు వ‌సూళ్ల‌ను మాత్ర‌మే లెక్కిస్తే 5.35కోట్ల షేర్ వ‌సూలైంది. నైజాం-1.35 కోట్లు.. సీడెడ్ - 82 ల‌క్ష‌లు.. వైజాగ్ -78 ల‌క్ష‌లు.. తూ.గో జిల్లా -48 ల‌క్ష‌లు.. ప‌.గో జిల్లా- 50ల‌క్షలు..కృష్ణ‌-25ల‌క్ష‌లు.. గుంటూరు 34ల‌క్ష‌లు.. నెల్లూరు15 లక్ష‌లు వ‌సూలైంది. ఏపీ-తెలంగాణ క‌లుపుకుని 4.6 కోట్లు ఇత‌ర‌ములు క‌లుపుకుని 5.35కోట్లు వ‌సూలైంది.