Begin typing your search above and press return to search.

హద్దులు దాటేసిన బ్యూటీ… మరీ ఇంతలానా? 

By:  Tupaki Desk   |   16 Jan 2023 4:30 PM GMT
హద్దులు దాటేసిన బ్యూటీ… మరీ ఇంతలానా? 
X
ఎంటర్టైన్మెంట్ రంగంలో సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. ఏం చేసిన జనాల దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా వారి పనులు ఉంటాయి. సోషల్ మీడియా వినియోగం ఎక్కువయ్యాక అలా తమ పిచ్చి పిచ్చి పనులతో సెలబ్రిటీలుగా మారిపోతున్న వారు చాలా మంది ఉన్నారు.

వింత వింత కాస్ట్యూమ్స్ తో సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి నెటిజన్లు దృష్టిని ఆకర్షిస్తూ విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ ఒకరు. సీరియల్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి పాపులర్ అయ్యింది.

ఆ తర్వాత తన విచిత్రమైన వస్త్రధారణతో నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది. నటీమణులు అందాల ప్రదర్శన కోసం హాట్ హాట్ డ్రెస్సులు వేయడం సహజమే. కాని ఉర్ఫీ జావెద్ వస్త్రధారణ మాత్రం చిత్ర విచిత్రంగా ఉంటుంది.

ఇతర నటీమణులకి విరుద్ధంగా ఆమె కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఒంటిపై నూలు పోగు లేకుండా కేవలం పెయింటింగ్ నే కాస్ట్యూమ్స్ గా మార్చేసుకుంటుంది. అలాగే ఒక్కోసారి విచిత్రంగా చిన్న చిన్న క్లాత్స్ ని కేవలం బ్యూటీ స్పాట్స్ కవర్ అయ్యే విధంగా కప్పుకొని రోడ్డు మీదకి వచ్చేస్తుంది.

తాజాగా మరోసారి అలాంటి వస్త్రధారణతో దిగిన వీడియోని ఇన్స్టాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ  వీడియో కాస్తా వైరల్ గా మారాయి ఎద అందాల కేవలం రెక్కల తరహాలో ఉన్నవాటితో కప్పుకొని ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఉర్ఫీ వీడియోపై మరో మోడల్ ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది. ఆడవాళ్ళకి ఉన్న స్వేచ్చా రెక్కలు వారి కలలని నిజం చేసుకోవడం కోసమే అంటూ ఉర్ఫీని ప్రశంసిస్తూ కామెంట్ చేసింది. అయితే చాలా మంది ఈ వీడియోపై కాస్తా వల్గర్ గా కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. ఇక ఈ బ్యూటీ ఎంత రెచ్చిపోతున్నా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం రావడం లేదు. ఏదో అలా అలా రియాలిటీ షోలు చేసుకుంటూ వెళుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.