Begin typing your search above and press return to search.

ఇంత‌టి అందం ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంద‌ట‌

By:  Tupaki Desk   |   9 Jun 2022 4:30 AM GMT
ఇంత‌టి అందం ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంద‌ట‌
X
బిగ్ బాస్ OTT (హిందీ) ఫేమ్ ఉర్ఫీ జావేద్ ఇటీవ‌ల‌ సోషల్ మీడియా సంచ‌ల‌నంగా మారిన‌ సంగ‌తి తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ వేదిక‌గా ఈ అమ్మ‌డికి అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. నిరంత‌రం త‌న ఫాలోవ‌ర్స్ ని ఖుషీ చేసేందుకు వ‌రుస ఫోటోషూట్లు వీడియో షూట్ల‌తో ఉర్ఫీ బోలెడంత‌ సంద‌డి చేస్తోంది.

మోడల్ కం నటి ఉర్ఫీ జావేద్ ఇటీవ‌ల‌ తరచుగా మీడియా హెడ్ లైన్స్ లోకి వ‌స్తోంది. ఇక ఫ్యాష‌న్స్ అనుక‌ర‌ణ‌లో ఈ భామ‌ వెరైటీ ఆలోచ‌న‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.. రొటీన్ ట్రెడిష‌న‌ల్ దుస్తుల‌కు భిన్నంగా వికారమైన ఫ్యాషన్ సెన్స్ ఉర్ఫీ ప్ర‌త్యేక‌త‌. దీనికి యూత్ లో గొప్ప ఫాలోయింగ్ ఏర్ప‌డింది. తాజాగా ఉర్ఫీ షేర్ చేసిన మిర్ర‌ర్ ఫోటోషూట్ మ‌తులు చెడ‌గొడుతోంది. ఇందులో బిగ్ బాస్ ఓటీటీ బ్యూటీ ఎంతో హాట్ గా క‌నిపిస్తోందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఆరు బ‌య‌ట ఆకుప‌చ్చ మైదానంలో టేబుల్ పై సెట్ చేసిన గ్లాస్ పై ఉర్ఫీ ఫోజ్ అదిరింది. ఇక బ్లూ అండ్ బ్లూ డ్రెస్ లో ఉర్ఫీ మిల్కీ వైట్ అందాలు అంతే ఆక‌ర్షణీయంగా క‌నిపిస్తున్నాయి.

పేరు మార్పు దేనికి ఉర్ఫీ?

అంతేకాదు.. ఉర్ఫీ స‌డెన్ గా పేరు మార్చుకుంది. త‌న‌ మొదటి పేరులో అదనంగా O ని జోడించబడింది. 24 ఏళ్ల ఈ బ్యూటీ నేమ్ స్పెల్లింగ్ ను ఇప్పుడు మార్చుకోవాల్సి ఉంటుంది. Urfi నుండి Uorfi కి మారింది. ఈ మారిన ఈ కొత్త స్పెల్లింగును ఇప్పుడు అంద‌రూ గుర్తుంచుకోవాల‌న్న‌మాట‌. అయితే ఇలా పేరు స్పెల్లింగ్ ను మార్చినప్పటికీ ఉచ్చారణ అలాగే ఉంటుంది.

ఇప్పటికీ హిందీ ప‌రిశ్ర‌మ‌లో కొత్త మార్పున‌కు అలవాటు పడుతున్న Uorfi ఇన్ స్టా స్టోరీలో కొత్త యాడింగ్ ను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరింది. “హాయ్ అబ్బాయిలు.. నేను అధికారికంగా నా పేరు Uorfi ను మార్చుకున్నాను. ఇది ఉర్ఫీ లాగానే ప‌ల‌కాలి. కేవలం స్పెల్లింగ్ మార్పు. ఇప్పుడు నా పేరు రాసేటప్పుడు అందరూ జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాను. తద్వారా నేను కూడా బుద్ధిమ‌తురాలిగా ఉంటాను (కొన్నిసార్లు మరచిపోతూనే ఉంటాను .. చిలిపిగా) థాంక్యూ.. లవ్ ఉర్ఫీ” అని వ్యాఖ్య‌ను జోడించింది.
ట్రోలింగ్ అన్ లిమిటెడ్..

ఉర్ఫీ జావేద్ తన ఫ్యాషన్ ఎంపికల విష‌యంలో తరచుగా ట్రోలింగుకి గుర‌వుతూనే ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ బ్యూటీ తాజా దుస్తుల ఎంపిక మళ్లీ అగ్గి రాజేసింది. బెల్ బాటమ్ ప్యాంట్ తో పాటు స్కై బ్లూ బ్రాలెట్ ను ధరించిన ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాల్లో కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. ఇవ‌న్నీ వైరల్ అయ్యాయి. `చాలా ఎక్కువ ఓపెన‌వుతోంది! `.. `ఇస్కో శరం నహీ హై` అని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే అత‌డి కామెంట్ కి ఉర్ఫీ స్పందిస్తూ.. తాను స్కిన్ కలర్ బ్రా ధరించానని.. అది పారదర్శకంగా లేదని ఆమె సోషల్ మీడియాలో స్పష్టం చేసింది. ఇలాంటి రిస్క్ తీసుకుని మ‌రీ టూమ‌చ్ గా ఉండే దుస్తులు ధరించాలా? అని కూడా ప్ర‌శ్నించారు కొంద‌రు. ఉర్ఫీ ఎప్పుడూ n*p కవర్ లను ధరిస్తానని కూడా నేరుగా అభిమానుల‌తో ముచ్చ‌టించ‌డం మ‌రింత‌గా వేడెక్కించింది. ఎవరైనా ఇప్పటికీ తన ని*లను చూడగలిగితే.. వారు డ్రగ్స్ తీసుకుని వక్రబుద్ధితో భ్రమపడుతున్నట్టేన‌ని ఘాటుగానే కామెంట్ చేసింది.

ఇదిలా ఉంటే ఉర్ఫీ ఇటీవల సోషల్ మీడియాల్లో నిరంతరం ట్రోలింగ్ బెదిరింపుల వ్య‌వ‌హారంపైనా ఓపెనైంది. ఆమె ఇలా పేర్కొంది. ``నిరంతర బెదిరింపులు.. ట్రోలింగ్ కొన్నిసార్లు నన్ను వెర్రిదానిగా చేస్తుంది. నేను ఏడుస్తాను.. చాలా ఏడుస్తాను కానీ జీవితం కొనసాగుతుందని నేను ఊహిస్తున్నాను. మీరు చేయాల్సింది చేస్తున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోని వారు ఇదేమీ పట్టించుకోరు! సాధారణంగా నేను బాగానే ఉన్నాను.. కానీ ఈ రోజు చాలా అరుదైన రోజు. ఇలాంటి ద్వేషాల‌ను వదులుకోవాలని కోరుతున్నాను. ద్వేషం, .. దుర్భాషలు,.. ట్రోల్ లు,.. బెదిరింపులు,.. రేప్ బెదిరింపులు,.. హత్య బెదిరింపులు.. ఇవేవీ స‌రి కావు`` అని అంది.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఉర్ఫీ తాను చాలా ఎదుర్కొన్నానని .. ఆత్మహత్య ఆలోచనలను కూడా కలిగి ఉన్నానని వెల్లడించింది. ఆమె త‌న జీవితాన్ని వదులుకోవడానికి సిద్ధ‌మైంది. కానీ దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియదని ఆమె పేర్కొంది. మీకు ఉన్న ఏకైక ఎంపిక ఇది వరకు మీరు ఎంత బలంగా ఉన్నారో మీకు తెలియదు. కానీ చనిపోతే ఎలా? నాకు చనిపోయే ధైర్యం లేదు కాబట్టి నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను``అని ఆమె చెప్పింది.