Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: యూరి ప్రతీకారం

By:  Tupaki Desk   |   29 Sep 2018 1:20 PM GMT
ట్రైలర్ టాక్: యూరి ప్రతీకారం
X
బయోపిక్స్ మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాలు కూడా ఇప్పుడు కొత్త ట్రెండే. అలాంటి చిత్రమే ఈ 'యూరి'. జవానులు ప్రయాణం చేస్తున్న వాహనాలపై తీవ్రవాద దాడి జరగడంతో 18 సెప్టెంబర్ 2016 న 19 మంది జవానులు కాశ్మీర్ లోని యూరి బేస్ క్యాంప్ లో ప్రాణాలు విడిచారు. దీనికి ప్రతీకార చర్యగా టెర్రరిస్ట్ లను ఏరిపారేసేందుకు భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టింది. ఈ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'యూరి'. ఇక భారత సైన్యం దీని గురించి బయటకు చెప్పేవరకూ ఎవరికీ సమాచారం లేదు.

ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. టీజర్లో మొదటి సీన్ లోనే ఇండియన్ మిలిటరీ వెహికల్స్ పై దాడి జరగడం చూపించారు. "హిందూస్తాన్ కె ఆజ్ తక్ కె ఇతిహాస్ మె హమ్ నె కభీ భీ కిసీ దూస్రే ముల్క్ పే పెహేలావార్ నహీ కియా హై"(భారత దేశ చరిత్రలో ఇప్పటివరకూ మనం ఇతర దేశాలపై మొదటి సారి దాడి చెయ్యలేదు) అని బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్ వినిపిస్తుంది. గతంలో మన దేశంపై పాకిస్తాన్ చేసిన దాడులను ప్రస్తావించి 'యహీ మౌకా కై ఉన్ కె దిల్ మె డర్ బిటానేకా'(ఇదే మనకు అవకాశం.. వాళ్ళకు భయం అంటే ఏంటో చూపించేదానికి) అంటూ " ఏ నయా హిందూస్తాన్ హై.. ఘర్ మె ఘుసేగా భీ. ఔర్ మారేగా భీ"(ఇది కొత్త భారత దేశం.. ఇంట్లో దూరుతుంది.. దూరి చంపుతుంది కూడా) అంటాడు.

దాడిలో మరణించిన భారత జవాను కూతురు అమరుడైన తన నాన్నకు సెల్యూట్ చేస్తూ కంటనీరు పెట్టుకోవడం ఈ టీజర్ లో ఒక హైలైట్. ఒక సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన షాట్స్ కూడా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఓవరాల్ గా టీజర్ 'యూరి' ఒక సూపర్బ్ పేట్రియాటిక్ ఫిలిం అనే ఫీల్ కలిగించింది. విక్కీ కౌశల్ ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా లీడ్ రోల్ లో నటించగా ఆదిత్య ధర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.